Citadel: Honey Bunny Teaser Out: ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’లా బ్లాక్ బస్టర్ సిరీస్ లను తెరకెక్కిన రాజ్, డీకే  దర్శకత్వంలో రాబోతున్న మరో యాక్షన్ వెబ్ సిరీస్  ‘సిటాడెల్: హనీ బన్నీ’. సౌత్ స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు, బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అదిరిపోయే స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.  రీసెంట్ గా ఈ సిరీస్ కు సంబంధించి అమెజాన్ ప్రైమ్ కీలక అప్ డేట్ ఇచ్చింది. ఇన్ స్టా వేదికగా ’01.08’ అంటూ పోస్టు పెట్టింది. అయితే, ఈ సిరీస్ ఆగష్టు 1న విడుదల అవుతుందని అందరూ భావించారు. అయితే, సిరీస్ ను రిలీజ్ చేయలేదు గానీ, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబడంతో పాటు టీజర్ ను రిలీజ్ చేశారు.


ప్రేక్షకులను అలరిస్తున్న యాక్షన్ సన్నివేశాలు


ఇక ‘సిటాడెల్: హనీ బన్నీ’ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సమంతా, వరుణ్ ధావన్ కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో మెస్మరైజ్ చేశారు. హాలీవుడ్ ‘సిటాడెల్’కు ఏమాత్రం తీసిపోని రీతిలో రాజ్, డీకే ఈ సిరీస్ ను రూపొందించారు. యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్ కలబోతతో కూడిన ఈ టీజర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తోంది. అటు బ్యాక్‌ గ్రౌండ్‌ లో ప్లే అవుతున్న 'రాత్ బాకీ' అనే హిందీ పాట టీజర్ లో మరింత హైలెట్ గా నిలిచింది. ఈ టీజర్ సిరీస్ పై భారీగా అంచనాలు పెంచుతోంది. ఈ వెబ్ సిరీస్ లో సికిందర్ ఖేర్, కేకే మీనన్, షకీబ్ సలీమ్, సిమ్రన్, సోహమ్ మజుందార్ కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్ తో ఈ సిరీస్‌ను భారత్ తో పాటు సైబీరియాలో తెరకెక్కించారు.


సరికొత్తగా కనిపిస్తున్న సమంతా


‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్ లో సమంత పూర్తి డిఫరెంట్ అవతార్‌ లో కనిపించబోతోంది. ‘ఫ్యామిలీ మ్యాన్‌2’లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్ తో ఆకట్టుకున్న సమంత ఈ సిరీస్ కోసం స్పెషల్ గా మార్షల్‌ ఆర్ట్స్‌ లో ట్రైనింగ్ తీసుకుంది. ఈ సిరీస్‌ లో వరుణ్‌, సమంతా కలిసి చేసే యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. 1990ల నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌ లో చాలా చోట్ల సమంతా డూప్ లేకుండా యాక్షన్ సీన్లు చేసినట్లు తెలుస్తోంది. ‘ సిటాడెల్: హనీ బన్నీ’ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కు రానుంది. అటు హాలీవుడ్‘సిటాడెల్‌’లో ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌ తో వరుణ్‌ ధావన్‌ ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్నారు.  



సమంతా 'సిటాడెల్: హనీ బన్నీ' సిరీస్ తో పాటు తన హోమ్ ప్రొడక్షన్‌ లో తెరకెక్కుతున్న తొలి చిత్రం 'బంగారం'లో కనిపించనుంది. సమంత చివరిసారిగా విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ చిత్రంలో నటించింది. ఈ సినిమా పలు భాషల్లో విడుదలైనా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.



Read Also: తొలి సినిమాకే అవార్డు, మూడో సినిమాకే రూ. 100 కోట్ల గ్రాస్‌ - #NBK109 డైరెక్టర్ బాబీ బర్త్‌డే గ్లింప్స్ చూశారా?