Ritu Varma's Telugu Romantic Comedy Web Series Streaming On Jio Hotstar: టాలీవుడ్ యంగ్ హీరోయిన్, 'పెళ్లి చూపులు' మూవీ ఫేం రీతు వర్మ సరికొత్త రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్‌తో ముందుకొస్తున్నారు. ఈ సిరీస్‌కు దేవికా & డానీ అనే టైటిల్ ఖరారు చేయగా.. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
ఆ ఓటీటీలో స్ట్రీమింగ్
ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కానుండగా.. ఫస్ట లుక్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. సిరీస్‌లో సూర్య వశిష్ట, రీతు వర్మ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. 'శ్రీకారం' మూవీ ఫేం కిషోర్ రూపొందిస్తున్నారు. రీతు వర్మ రోల్ డిఫరెంట్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వర్షంలో ఓ చేతిలో గొడుగు పట్టుకుని ఉండగా ఆమెను ప్రేమగా సూర్య చూస్తున్నట్లు ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్‌లో రీతు వర్మ టీచర్ రోల్ చేస్తున్నట్లు లుక్‌ను బట్టి అర్థమవుతోంది. '2 హృదయాలు. ఒకే భవిష్యత్తు. దేవికగా రీతు వర్మ, డానీగా సూర్య వశిష్ట ఆత్మీయ బంధాన్ని చూడండి. త్వరలోనే దేవిక అండ్ డానీ వచ్చేస్తోంది.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
జాయ్ ఫిల్మ్స్ ఈ సిరీస్ నిర్మించగా.. శివ కందుకూరి మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సూర్య వశిష్ట, సుబ్బరాజు, మౌనికా రెడ్డి, సోనియా సింగ్, చాగంటి సుధాకర్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు జై క్రిష్ మ్యూజిక్ అందించారు. త్వరలోనే టీజర్, ట్రైలర్, స్ట్రీమింగ్ డేట్ వెల్లడి కానున్నాయి.
Also Read: మెగాస్టార్ 'విశ్వంభర'లో అవనిగా త్రిష - బర్త్ డే గిఫ్ట్‌గా పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ టీం
రీతు వర్మ గతంలో మోడ్రన్ లవ్ హైదరాబాద్, మోడ్రన్ లవ్ చెన్నై వెబ్ సిరీస్‌ల్లో నటించారు. ఇప్పుడు తాజాగా మరో సిరీస్‌తో అలరించనున్నారు. ఎన్టీఆర్ 'బాద్ షా' మూవీతో రీతు వెండితెరకు పరిచయమయ్యారు. కాజల్ చెల్లెలిగా నటించి మెప్పించారు. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'నా రాకుమారుడు', 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాల్లో నటించారు. విజయ్ దేవరకొండ 'పెళ్లి చూపులు' సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి మంచి ఫేం సంపాదించుకున్నారు రీతు.
ఆ తర్వాత వరుసగా తమిళ, తెలుగు సినిమాల్లో నటించారు. 'వీఐపీ 2'తో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. సల్మాన్ జోడీగా 'కనులు కనులు దోచాయంటే' మూవీ ఆమె కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్. ఆ తర్వాత శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' సినిమా కూడా రీతుకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇటీవల ఆమె నటించిన 'మజాకా' బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేదు. అంతకు ముందు 'శ్వాగ్' మూవీ కూడా నిరాశపరిచింది. ఈ సిరీస్‌తో మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.