Pawan Kalyan - Balakrishna : పవన్ కొలతలు కావాలి, బాలకృష్ణ మాట విన్నారా? - 'అన్‌స్టాపబుల్‌ 2' వీడియో గ్లింప్స్ వచ్చేసిందండోయ్

NBK X PSPK's Unstoppable Video Glimpse : 'అన్‌స్టాపబుల్‌ 2' టాక్ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చిన ఎపిసోడ్ గ్లింప్స్ ఈ రోజు విడుదల చేశారు. 

Continues below advertisement

Unstoppable 2 with NBK : 'వీర సింహా రెడ్డి'తో 'వీరమల్లు' సందడి ఎలా ఉంటుంది? అనేది చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. తెలుగు సినిమా ప్రేక్షకులు, రాజకీయ వర్గాలతో పాటు నందమూరి ఫ్యాన్స్, మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎపిసోడ్ నుంచి చిన్న వీడియో గ్లింప్స్ విడుదలైంది.

Continues below advertisement

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ను  ఒక్క స్క్రీన్ మీదకు తీసుకు వచ్చిన క్రెడిట్ 'ఆహా' ఓటీటీదే. 'అన్‌స్టాపబుల్‌ 2'కు పవన్ అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆ ఎపిసోడ్ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు.

వీడియో గ్లింప్స్‌లో పెద్దగా డైలాగులు లేవు. ఉన్నది ఒక్కటే డైలాగ్... పవన్ కళ్యాణ్ స్టేజి మీదకు వచ్చిన తర్వాత ''నేను కొన్ని మెజర్‌మెంట్స్ (కొలతలు) తీసుకోవాలి'' అని బాలకృష్ణ అన్నారు. అంతే ఒక్కసారిగా పవన్ నవ్వేశారు. ఈ విజువల్స్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. షోలో ఇద్దరి మధ్య చాలా ఇటువంటి సరదా సంభాషణలు చాలా ఉన్నాయట. 

సంక్రాంతి సినిమాల చర్చ ఉంటుందా?
పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూటింగ్ డిసెంబర్ నెలాఖరున జరిగింది. అప్పటికి 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతికి విడుదల కావడం ఖరారు అయ్యింది. ప్రభాస్ ఎపిసోడ్‌లో రామ్ చరణ్ ఫోనులో మాట్లాడినప్పుడు 'ముందు నా సినిమా చూడు. ఆ తర్వాత మీ నాన్న సినిమా చూడు' అని బాలకృష్ణ చెప్పారు. పవన్ సాధారణంగా సినిమాలు చూడరు. అందువల్ల, సంక్రాంతి సినిమాల గురించి చర్చ వచ్చిందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.

రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి
బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఏయే టాపిక్స్ గురించి 'అన్‌స్టాపబుల్‌ 2'లో మాట్లాడారు? అని సినిమా ప్రేక్షకులు మాత్రమే కాదు... రాజకీయ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో అధికార పార్టీ కూడా! ఎందుకంటే... ఇటీవల తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ కలిశారు. ప్రతిపక్షాలపై ప్రభుత్వ వైఖరి సహేతుకంగా లేదంటూ సంఘీభావం ప్రకటించారు. మరోవైపు అమెరికాలో అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో 'అన్‌స్టాపబుల్‌ 2' ఎపిసోడ్ గురించి వైసీపీ కూడా ఎదురు చూస్తోంది. 

Also Read : వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య... పుచ్చకాయల్ని కోసినట్లు తలలు తెగేలా నరికేయడం హీరోయిజమా?  

విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ అతిథులుగా వచ్చిన ఎపిసోడ్‌లోనే పవన్ కళ్యాణ్ 'అన్‌స్టాపబుల్‌ 2'కు వస్తారని ప్రేక్షకులకు అర్థమైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఫోన్ చేయగా... 'అన్‌స్టాపబుల్‌కు ఎప్పుడు వస్తున్నావ్?' అని బాలకృష్ణ అడగటం, 'మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తాను సార్' అని త్రివిక్రమ్ బదులు ఇవ్వడం తెలిసిన విషయమే. అప్పుడు బాలకృష్ణ 'ఎవరితో రావాలో తెలుసుగా!?' అని అడగటం వైరల్ అయ్యింది. అప్పుడే పవన్‌ వస్తారని అర్థమైంది. 

Also Read : విలన్‌కు హీరోయిన్‌ ఛాన్స్‌ - బాలకృష్ణ ప్రామిస్  

Continues below advertisement
Sponsored Links by Taboola