మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’తో తెలుగు ప్రేక్షకులను పలకరించారు తమిళ హీరో ‘జయం’ రవి. ఇటీవల భార్య ఆర్తితో డైవోర్స్ తీసుకున్నారు. ఆ సమయంలో ‘జయం’ రవి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఆయనకు ఒక స్నేహితురాలతో ఎఫైర్ ఆ విడాకులకు కారణమని కోడై కూసింది. సరిగ్గా ఆ సమయంలోనే ఆయన నటించిన ‘బ్రదర్’ విడుదలైంది.
‘బ్రదర్’ రిలీజ్ టైంలో ‘జయం’ రవిపై గాసిప్స్ ఏ రేంజ్ లో హల్ చల్ చేశాయంటే... ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఫోటో తీసి, క్రాప్ చేసి, ఈ సినిమా హీరోయిన్ ప్రియాంకా మోహన్ (నాని గ్యాంగ్ లీడర్ ఫేమ్)తో పెళ్లంటూ ప్రచారం చేశారు. ఓ రకంగా ఈ ఫేక్ న్యూస్ సినిమా పబ్లిసిటీకి బాగా హెల్ప్ చేసింది. కానీ సినిమా మాత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఎం రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళికి విడుదలైంది. ప్రస్తుతం ఓటీటీలోకి రావడానికి సిద్ధంగా ఉంది.
జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ‘బ్రదర్’
Jayam Ravi's Brother OTT Streaming: ‘జయం’ రవి నటించిన ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను జీ5 సొంతం చేసుకుంది. తమిళంలో ఈ సినిమా నవంబర్ 29న (అంటే... శుక్రవారం రేపటి నుంచి) స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు సైతం సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
‘బ్రదర్’ కథ లోకి వెళితే...
కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేని కార్తీ (‘జయం’ రవి) అనేక సార్లు ఇబ్బందుల్లో పడుతూ ఉంటాడు. తన కుటుంబాన్ని కూడా ఇరుకులో పెడుతూ ఉంటాడు. ఈ కారణంగా అతనికి తండ్రితో ఎప్పుడూ గొడవలే. కొడుకు మారితేనే తన ఆరోగ్యం బాగుపడుతుందని తండ్రి అంటాడు కూడా. తన ప్రవర్తనతో చివరకు ఓ డిగ్రీ కూడా సంపాదించుకోలేకపోతాడు. న్యాయం కావాలని గొడవలు పడే మనిషితో లా డిగ్రీ చేయిస్తే బాగుపడతాడేమోనని భావిస్తారు తల్లిదండ్రులు. కానీ అక్కడా వారికి నిరాశే ఎదురైంది. అక్కడా కార్తీ న్యాయం కోసం పోరాడి తాను అన్యాయమైపోతాడు. లా డ్రాపౌట్ గా మిగిలిపోతాడు. కనీసం అక్క ఆనంది(భూమిక) దగ్గరకు పంపిస్తే అక్కడైనా బాగుపడతాడేమోనని వాళ్ల ఆశ. కానీ కార్తీ వల్ల వాళ్ల కుటుంబం చిక్కుల్లో పడుతుంది. కార్తీ వీటిని ఎలా పరిష్కరించాడన్నది మిగతా కథ.
Also Read: ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం 'క'... సౌండింగ్‌తో కుమ్మేసిన ఈటీవీ విన్ యాప్, స్ట్రీమింగ్ షురూ
మణిరత్నం ’థగ్ లైఫ్’ మిస్ అయ్యారు
వ్యక్తిగతంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న ‘జయం’ రవి తన పై వస్తున్న గాసిప్స్ కు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇక సినిమాలపై ఫోకస్ చేస్తానని చెప్పారు కూడా. అయితే ఈ లోగానే ఆయనో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు. కమల్ హాసన్ హీరోగా నటించిన ‘థగ్ లైఫ్’ చిత్రంలో మొదటగా ఓ పాత్రకు ‘జయం’ రవినే తీసుకున్నారు దర్శకుడు మణిరత్నం. డేట్లు సర్దు బాటు చేయలేక ఈ సినిమా నుంచి తప్పుకున్నారు రవి. తాజాగా ఆయన నటించిన ’జీని’, ‘కాదలిక నేరమిల్లై’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నిత్యామీనన్ కథానాయికగా నటించిన ‘కాదలిక నేరమిల్లై’ చిత్రంలోని ఓ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతోంది. సోదరుడు మోహన్ రాజా దర్శకత్వంలో కొన్నేళ్ల క్రితం వచ్చిన ‘తన్నీ ఒరువన్’ సినిమా కు సీక్వెల్ కూడా రానుందని ప్రకటించారు రవి.
Also Read:ఓటీటీలోకి లక్కీ భాస్కర్... 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందంటే?