విజయ్ సేతుపతి (Vijay Sethupathi), నిత్యామీనన్ (Nitya Menon) జంటగా నటించిన చిత్రం 'తలైవాన్ తలైవి (Thalaivan Thalaivii)'. దీనిని తెలుగులో 'సార్ మేడమ్ (Sir Madam)' పేరుతో విడుదల చేశారు. విజయ్ సేతుపతి, నిత్యామీనన్‌కి టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. పైగా వీరిద్దరూ కలిసి నటిస్తోన్న సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. దానికి తగ్గట్లుగానే సెన్సిటివ్ కథాంశంతో సార్ మేడమ్ సినిమాను తెరకెక్కించారు. థియేటర్లో మంచి టాక్‌ను అందుకొన్న ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో అలరిస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే..
అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'సార్ మేడమ్'
Sir Madam OTT Release Date And Platform : 'సార్ మేడమ్' సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషలలో సినిమాను విడుదల చేశారు. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో ప్రసారం అవుతుంది. బాక్సాఫీస్ వద్ద తమిళంలో 75 కోట్లు రాబట్టిన ఈ చిత్రం తక్కువ సమయంలోనే ఓటీటీలోకి వచ్చేసింది.
సార్ మేడమ్..
పెళ్లైన కొత్తలో గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరి మధ్యలో.. కొన్ని నెలల్లోనే గొడవలు మొదలవుతాయి. ఇవి పెరిగి విడాకులకు దారితీస్తాయి. ఇదే కథ ఆధారంగా 'సార్ మేడమ్' సినిమాను రూపొందించారు. సినిమాలో విజయ్ సేతుపతిని, నిత్యా మీనన్ నువ్వా నేనా అన్నట్లు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాలో వారి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. యోగి బాబు కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. సంతోష్ నారాయణన్ అందించిన నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని హైలెట్ చేసింది.
ఈ సినిమాలో కామెడీతో పాటు మంచి ప్రేమకథకు సంబంధించిన అన్ని అంశాలను కవర్ చేశాడు డైరక్టర్ పాండిరాజ్. భార్యాభర్తల మధ్య సమస్యలను హాస్యభరితంగా, సెకండాఫ్‌లో భావోద్వేగభరితంగా బాగా చూపించగలిగాడు. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందించిన తెలుగు ప్రేక్షకులు ఓటీటీలో హిట్ చేస్తారో లేదో చూడాల్సిందే.
Also Read : మన్మథుడు హీరోయిన్ అన్షూపై సర్జరీ రూమర్స్.. ఘాటైన రిప్లై ఇచ్చిన భామ