Pawan Kalyan's OG Movie Out On OTT: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ 'ఓజీ'. ముంబై నేపథ్యంలో మాఫియా, గ్యాంగ్ వార్స్ కథతో తెరకెక్కిన చిత్రమిది. థియేటర్లలో పవన్ అభిమానులకు పూనకాలు తెప్పించిన చిత్రమిది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది? ఎన్ని భాషల్లో అందుబాటులో ఉంది? వంటి విషయాల్లోకి వెళితే...
నెట్‌ఫ్లిక్స్‌లో 'ఓజీ' స్ట్రీమింగ్... ఐదు భాషల్లో!OG Movie OTT Streaming Platform Release Date Details: పవన్ కళ్యాణ్ 'ఓజీ' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు (అక్టోబర్ 23వ తేదీ, గురువారం) మిడ్ నైట్ 12 గంటల నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 'ఓజీ'ని స్ట్రీమింగ్ చేస్తోంది నెట్‌ఫ్లిక్స్. సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది 'ఓజీ'. ఒక్క రోజు ముందు... అంటే సెప్టెంబర్ 24న భారీ ఎత్తున పెయిడ్ ప్రీమియర్ షోలు వేశారు. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలోకి సినిమా వచ్చింది.
Also Read: 'మాస్ జాతర' ఫస్ట్ రివ్యూ... ఆ గంటసేపూ థియేటర్లు ఊగిపోతాయ్ - రవితేజ అభిమానులకు కిక్ ఇచ్చేలా!
'ఓజీ' కలెక్షన్లు 300 కోట్లు... ప్రీక్వెల్, సీక్వెల్ కూడా!OG Movie Collections: 'ఓజీ' చిత్రానికి పవన్ కళ్యాణ్ వీరాభిమాని సుజీత్ దర్శకత్వం వహించారు. 'సాహో' తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన చిత్రమిది. థియేటర్లలో 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. సినిమా సక్సెస్ తర్వాత 'ఓజీ' యూనివర్స్ కంటిన్యూ అవుతుందని స్వయంగా పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మూవీకి ప్రీక్వెల్, సీక్వెల్ చేయనున్నట్లు సుజీత్ వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించిన 'దే కాల్ హిమ్ ఓజీ'లో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేశారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, 'శుభలేఖ' సుధాకర్, సుదేవ్ నాయర్, హరీష్ ఉత్తమన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని తమన్ సంగీతం అందించగా... డీవీవీ దానయ్య, దాసరి కళ్యాణ్ ప్రొడ్యూస్ చేశారు.