Pawan Kalyan's OG OTT Release Date Locked: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీసెంట్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'OG' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అంటూ అటు ఫ్యాన్స్  ఇటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓటీటీ రిలీజ్‌ డేట్‌పై తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

Continues below advertisement

ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

'OG' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా... ప్రొడ్యూసర్స్ 4 వారాల ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 23 నుంచి మూవీ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. మూవీలో నేహాశెట్టి స్పెషల్ సాంగ్‌ను రీసెంట్‌గానే యాడ్ చేశారు. ఇక ఓటీటీ రిలీజ్ టైంలో ఆ సాంగ్‌తో పాటు థియేటర్ వెర్షన్‌లో కట్ చేసిన కొన్ని సీన్స్ కూడా యాడ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Continues below advertisement

Also Read: 'బాహుబలి 3'పై మేకర్స్ క్లారిటీ - 'బాహుబలి: ది ఎపిక్' క్లైమాక్స్‌లో బిగ్ సర్‌ప్రైజ్...

11 రోజుల్లో రికార్డు కలెక్షన్స్

ఈ మూవీకి 'సాహో' ఫేం సుజీత్ దర్శకత్వం వహించారు. గత నెల 25న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాగా 11 రోజుల్లోనే రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.308 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు మూవీ టీం తెలిపింది. 'రూల్స్ లేవు. చట్టాలు లేవు. గంభీర 'లా' మాత్రమే ఉంది. ఇతనే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్.' అంటూ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ ఓ స్పెషల్ పోస్టర్ సైతం రిలీజ్ చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. ఫస్ట్ డే రూ.154 కోట్లకు పైగా కలెక్షన్లతో పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

ఈ మూవీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటించగా... బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేశారు. ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించారు.

ప్రీక్వెల్, సీక్వెల్ కూడా...

ఈ మూవీకి ప్రీక్వెల్‌తో పాటు సీక్వెల్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు పవన్ కల్యాణ్. డైరెక్టర్ సుజీత్ కూడా సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేశారు. ప్రీక్వెల్‌లో పవన్ కుమారుడు అకీరా నందన్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో 'OG' ఫ్రాంచైజీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది.

స్టోరీ ఏంటంటే?

ముంబయి కొలాబా పోర్టును తన కనుసన్నల్లోనే ఉంచుకునే సత్య దాదా (ప్రకాష్ రాజ్) కొడుకును ఓ డ్రగ్స్ ముఠా చంపేస్తుంది. దీంతో పోర్టుకు డ్రగ్స్‌తో వచ్చిన కంటైనర్‌ను సత్యదాదా దాచేస్తాడు. ఆ కంటైనర్ కోసం పోర్టును ఆక్రమించుకోవాలనుకుని ప్రయత్నించే మిరాజ్ కర్ (తేజ్ సప్రూ) పెద్ద కొడుకు రంగంలోకి దిగుతాడు. దీంతో సత్య దాదా పెంచి పెద్ద చేసిన గంభీర (పవన్ కల్యాణ్) రంగంలోకి దిగుతాడు. సత్య దాదా ఫ్యామిలీ రక్షణగా నిలబడతాడు. అసలు ఆ ఫ్యామిలీని వదిలి గంభీర ఎందుకు వెళ్లాడు? కణ్మని ఎవరు? గంభీరకు కణ్మని ఎందుకు దూరమైంది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.