Fahadh Faasil's Odum Kuthira Chaadum Kuthira OTT Release On Netflix: 'పుష్ప 2' మూవీలో విలన్‌గా తన యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ 'ఓడుం కుతిర చాదుం కుతిర'. ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీలో మలయాళంలో మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీకి అల్తాఫ్ సలీం దర్శకత్వం వహించగా... ఆషిక్ ఉస్మాన్ నిర్మించారు. ఫహాద్ సరసన కల్యాణి ప్రియదర్శన్, రేవతి పిళ్లై హీరోయిన్లుగా నటించారు.
Also Read: తమన్నా 'గఫూర్' సాంగ్... షారుఖ్ ఖాన్ కొడుకు సిరీస్‌లో మిల్కీ బ్యూటీ సంచలనం... వైరల్ వీడియో ఇదే
స్టోరీ ఏంటంటే?
అభి (ఫహాద్ ఫాజిల్), నిధి (కల్యాణి ప్రియదర్శన్)కు పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయిస్తారు. ఎంగేజ్మెంట్ రోజు వెరైటీగా రాజాలా గుర్రంపై రావాలంటూ అభికి చెప్తుంది నిధి. దీంతో అలానే చేస్తాడు. అయితే, ఎవరూ ఊహించని విధంగా గుర్రంపై నుంచి కింద పడి తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్తాడు. ఇది చూసిన నిధి ఫ్యామిలీ ఆమెను మరో పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తారు. అలా మరొకరని వివాహం చేసుకునేందుకు ఆమె అంగీకరిస్తుంది. ఇదే టైంలో అభి పూర్తిగా కోలుకుంటాడు.
నిధికి వేరే వ్యక్తితో పెళ్లైందని తెలుసుకున్న అభి వేదనతో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటాడు. బెంగుళూరు వెళ్లగా అక్కడ ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత అభిలో వచ్చిన మార్పేంటి? ఆ అమ్మాయినే అభి పెళ్లి చేసుకున్నాడా? నిధి అతని జీవితంలోకి తిరిగి వచ్చిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.