Nilave Movie OTT Streaming: సౌమిత్ పోలాడి కథానాయకుడిగా పరిచయమైన సినిమా 'నిలవే'. హీరోగా నటించడంతో పాటు సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించారు. ఇందులో శ్రేయాసి సేన్ హీరోయిన్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 13న విడుదల అయ్యింది. థియేటర్లలోకి వచ్చిన రెండు నెలలకు ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ తెలుసుకోండి. 

ఈటీవీ విన్ ఓటీటీలోకి 'నిలవే'Nilave OTT Platform Streaming Date: ఈటీవీ విన్ ఓటీటీలోకి 'నిలవే' సినిమా వస్తోంది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన సమయంలో మంచి స్పందన అందుకుంది. మరి, ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Also Read: Priyanka Rajakumaran: ఎవరీ ప్రియాంక? తమిళ తెరపైకి వారసురాలు... పవన్‌తో సినిమా చేసిన హీరోయిన్ కుమార్తె

సూసైడ్ నుంచి మొదలైన ప్రేమ!తెలుగులో చాలా ప్రేమ కథలు వచ్చాయి. అయితే... 'నిలవే' ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ అని చెప్పాలి. ఇందులో హీరో అర్జున్ (సౌమిత్ పోలాడి) ఓ యాడ్ ఏజెన్సీలో ఫోటోగ్రాఫర్. అనాథ ఆశ్రమంలో పెరిగాడు. జీవితంలో తనకు ఓ తోడు కావాలని కోరుకుంటాడు. లేని కారణంగా సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. సరిగ్గా ఆ సమయంలో కిటికీ లోనుంచి ఎదురుగా ఉన్న ఫ్లాట్‌లో అమ్మాయి అతిథి (శ్రేయాసి సేన్) కనిపిస్తుంది. ఆమె తెలియకుండా ఫాలో అవుతాడు. తర్వాత పరిచయం పెంచుకుని ప్రేమలో పడతాడు. ఇద్దరూ కలిసి సహా జీవనం చేస్తాడు. అతిథి ప్రెగ్నెంట్ అవుతుంది. కానీ పెళ్లి మాత్రం చేసుకోనని అంటుంది. ఎందుకు? ఏమిటి? వీళ్ళ కథ ఏ తీరానికి చేరింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.   

Also Read: Nilave Movie Review - 'నిలవే' రివ్యూ: ప్రెగ్నెంట్ అయినా పెళ్లికి 'నో'... పొయెటిక్ ప్రేమకథలో ట్విస్ట్ - సినిమా ఎలా ఉందంటే?

'నిలవే'లో హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు. ఈ చిత్రాన్ని POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు. కళ్యాణ్ నాయక్ సంగీతం అందించారు. ఇందులో పదకొండు పాటలు ఉన్నాయి. పాటలతో పాటు నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్ అని చెప్పాలి. 

Also ReadShiman Mandanna: ఎవరీ షిమన్? విజయ్ - రష్మిక పెళ్లి సందడిలో క్యూట్ లిటిల్ గర్ల్ ఎవరో తెలుసా?