2025 పొంగల్ సందర్భంగా దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కానున్న తమిళ సినిమాల లిస్ట్ ను వెల్లడించింది. అందులో కాంత, థగ్ లైఫ్, గుడ్ బ్యాడ్ అగ్లీ, విడాముయార్చి, రెట్రో వంటి మోస్ట్ అవైటింగ్ సినిమాల నుంచి బైసన్, డ్రాగన్ చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. 


అజిత్ కుమార్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ 
తమిళ తల అజిత్ అభిమానులకు ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్ డబుల్ ట్రీట్ ఇవ్వబోతోంది. ఆయన హీరోగా నటించిన విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. అజిత్ కుమార్ - త్రిష కృష్ణన్ జంటగా నటించిన 'విడాముయార్చి' ఈ ఏడాది మోస్ట్ అవైటింగ్ తమిళ సినిమాలలో ఒకటి. అలాగే అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రెండు సినిమాల థియేట్రికల్ రన్ తరువాత నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయి. 






కమల్ హాసన్ 'థగ్ లైఫ్' 
దర్శకరత్నం మణిరత్నం డైరక్షన్ లో లోకనాయకుడు కమల్ హాసన్‌ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్, అత్యంత ప్రతిష్టాత్మక తమిళ చిత్రం 'థగ్ లైఫ్'. ఈ మూవీని జూన్ 5న థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నాము అని నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రంలో శింబు, త్రిష, పంకజ్ త్రిపాఠితో సహా పలువురు ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ కూడా థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యాక నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.  


ఈ మోస్ట్ అవైటింగ్ మూవీస్ కూడా నెట్ ఫ్లిక్స్ లోనే... 
సూర్య హీరోగా, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన 'రెట్రో' మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను కూడా నెట్ ఫ్లిక్స్ దక్కించుకోవడం విశేషం. దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే  నటించిన 'కాంత' కూడా ఇదే ఓటీటీలో రానుంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1950 నాటి మద్రాసు, ఇప్పటి చెన్నై నేపథ్యంలో సాగుతుంది. ఈ రెండు సినిమాలతో పాటు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా 'బైసన్', ప్రదీప్ రంగనాథన్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'డ్రాగన్' వంటి ఇంటెన్స్ డ్రామా మూవీస్ రైట్స్ ను కూడా సొంతం చేసుకున్నట్టు నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలన్నీ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. 






కలిసొచ్చిన గత ఏడాది 
నెట్‌ఫ్లిక్స్ 2024 బాగా కలిసి వచ్చింది. అమరన్, గోట్, మహారాజా, మీయజగన్ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాల రైట్స్ ను సొంతం చేసుకుని, సబ్స్క్రయిబర్స్ సంఖ్యను బాగానే పెంచుకుంది ఈ ఓటీటీ. అలాగే ఈ ఏడాది కూడా తమిళ మూవీ లవర్స్ ను థ్రిల్ చేయబోతోంది నెట్ ఫ్లిక్స్.