Murder mubarak release date ott: ప్రతివారం ఓటీటీలో కొత్త సినిమాలు సందడి చేస్తాయి. ప్రతీ శుక్రవారం నయా అప్‌డేట్స్‌తో ఓటీటీలు సిద్ధమవుతాయి. అయితే ఈవారం మాత్రం ఆడియన్స్‌కి డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు డబుల్‌ డజన్ సినిమాలు వచ్చేసాయి. అందులో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌, రొమాంటిక్‌ క్రైం థ్రిల్లర్‌ వంటి చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు వచ్చేసాయి. అందులో స్టార్‌ కిడ్‌ సారా అలి ఖాన్‌ లేటెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ 'మర్డర్‌ ముబారక్‌' ఒకటి. హిందీలో తెరకెక్కిన ఈ వెబ్‌ సీరిస్‌ నేడు నేరుగా ఓటీటీలో రిలీజ్‌ అయ్యింది. అర్థరాత్రి నుంచే ఈ వెబ్‌ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌ని ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు హోమీ అదజానియా దర్శకత్వం వహించారు.


నెట్‌ఫ్లిక్సలో స్ట్రీమింగ్‌


పంకజ్‌ త్రిపాఠి, సారా అలీఖాన్‌, విజయ్‌ వర్మ, కరిష్మా కపూర్‌, డింపుల్‌ కపాడియా, సంజయ్‌ కపూర్‌, టిస్కా చోప్రా, సోహైల్‌ నయ్యర్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ క్రైం డ్రామాను మాడాక్‌ పతాకంపై నిర్మించారు. అనుజా చౌహాన్ రాసిన 'క్లబ్ యూ టు డెత్' నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్‌ హోమీ అదజానియా. రొమాంటిక్‌ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈవెబ్‌ సీరిస్‌ మార్చి 15న నేరుగా ఓటీటీలో రిలీజ్‌ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది నెట్‌ఫ్లిక్స్‌. ఈ క్రైం అండ్‌ మిస్టరీ థ్రిల్లర్‌ని ఇంట్లోనే చూసి ఎంజాయ్‌ చేసేయండి.  


కథ విషయానికి వస్తే


కేవలం దనవంతులు మాత్రమే సభ్యులుగా ఉండే 'ది రాయల్ ఢిల్లీ క్లబ్‌'లో మర్డర్ జరుగుతుంది.అతడు ఓ ప్రముఖ వ్యక్తి కావడంతో ఈ హత్య సంచలనంగా మారుతుంది. ఈ మర్డర్‌ వెనక ఉన్న మిస్టరీ, నిందితులను పట్టుకునేందుకు పోలీసుల బ్రందాలు రంగంలోకి దిగుతాయి. అయితే వారందరిని లీడ్‌ చేసేందుకు పవర్ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌ భవానీ సింగ్ (పంకజ్ త్రిపాఠి) ఈ కేసులో స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమిస్తారు. ఇక ఈ కేసును ఛేదించే క్రమంలో పోలీసులకు ఎదురైన సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. ఇక నిందితులను కనిపెట్టే క్రమంలో పోలీస్‌ ఆఫీసర్‌ భవానీ సింగ్‌కు ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి, ఇంతకి హంతకులను పట్టుకున్నాడా? లేదా? అనేది 'మర్డర్‌ ముబారక్‌'


ఉత్కంఠగా సాగే ఈ సిరీస్‌ను 2023 ఫిబ్రవరిలో షూట్ మొదలుపెట్టారు. పంకజ్‌ త్రిపాఠి, సారా అలీఖాన్‌, తమన్నా బాయ్‌ ఫ్రెండ్‌ విజయ్‌ వర్మ, కరిష్మా కపూర్‌, డింపుల్‌ కపాడియా వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడో పదేళ్ల క్రితమే ఈ సిరీస్‌ షూటింగ్‌ మొదలైంది. 2013లోనే మర్డర్‌ ముబారక్‌ సిరీస్‌ షూటింగ్‌ మొదలుపెట్టగా దాదాప పదేళ్ల తర్వాత ఇది స్ట్రీమింగ్‌ రావడం గమనార్హం. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ భారీ అంచనాల మధ్య నేడు ఓటీటీలోకి వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌ మూవీ లవర్స్‌ మెప్పిస్తుందా? లేదా? చూడాలి!