Tom Cruise's Mission Impossible OTT Streaming On Amazon Prime Video: హాలీవుడ్ యాక్టర్ టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రికనింగ్'. ప్రపంచవ్యాప్తంగా మే 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో క్రిస్టోఫర్ మేక్ క్వారీ తెరకెక్కించిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా దాదాపు 600 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది.
ఆ ఓటీటీలోకి స్ట్రీమింగ్... అయితే...
దాదాపు 3 నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతోంది 'మిషన్ ఇంపాజిబుల్'. ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ఈ మూవీ ప్రస్తుతం అందుబాటులో ఉంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. న్యూజిలాండ్, యూఎస్‌లో పూర్తిస్థాయిలో ఓటీటీలోకి అందుబాటులోకి రాగా... భారత్‌లో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.
'అమెజాన్ ప్రైమ్ వీడియో'తో పాటే ఆపిల్ టీవీ ప్లస్, ఫాండంగో ఓటీటీల్లో రెంటల్ విధానంలో ఈ మూవీ అందుబాటులో ఉంది. త్వరలోనే 'Paramount+' లో అక్టోబర్ నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఫైనల్ చిత్రం ఇదేనా?
'మిషన్ ఇంపాజిబుల్' ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వచ్చిన 8వ చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్: ది పైనల్ రికనింగ్'. ఈ మూవీలో టాప్ క్రూజ్‌తో పాటు హైలీ యూట్ఎల్, వనేసా కొర్బీ, సైమన్ పెగ్, హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్, హెన్రీ జెర్నీ, ఏంజెలా బాసెట్, ఎసై మోరల్స్ కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటే వాడింగ్ హామ్, నిక్ ఆఫర్ మాన్, కేటీ ఓ బ్రియాన్ వంటి కొత్త వారు కూడా నటించారు. ఈ మూవీని టామ్ క్రూజ్, క్రిస్టోఫర్ మెక్ క్వారీ నిర్మించగా... మ్యాక్స్ అరుజ్, ఎలైఫ్ గాడ్ ఫ్రే మ్యూజిక్ అందించారు.
1996లో 'మిషన్ ఇంపాజిబుల్' ఫ్రాంచైజీ ప్రారంభం కాగా ఇది ఫైనల్ మూవీ అంటూ ప్రచారం సాగుతోంది. ఇప్పటివరకూ ఈ ఫ్రాంచైజీలో వచ్చిన మూవీస్ మంచి విజయం అందుకున్నాయి. లేటెస్ట్ మూవీ ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో చిత్రీకరించడంతో ఆడియన్స్‌కు మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది.
Also Read: ఓటీటీలో వీరమల్లు... క్లైమాక్స్ మారింది, లెంగ్త్ తగ్గింది - థియేటర్లలోకి ఈ ప్రింట్ వస్తేనా?
స్టోరీ ఏంటంటే?
'మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రికనింగ్' ఫస్ట్ పార్ట్ ఎక్కడ ముగిసిందో ఈ మూవీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రపంచాన్ని శాసించే శక్తి గల 'ఏఐ' 'ది ఎంటిటీ'ని నియంత్రించే కీస్ సొంతం చేసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. ఆ తాళాలు వాళ్లకు చిక్కకుండా ఎంఐ ఏజెంట్ ఈథన్ హంట్ (టామ్ క్రూజ్) దక్కించుకుంటాడు. సముద్ర గర్భంలోని మెరైన్‌లో దీని ఒరిజినల్ సోర్స్ కోడ్ ఉంటుంది. దాన్ని నాశనం చేసి ప్రపంచాన్ని కాపాడాలంటూ ఈథన్‌కు వాయిస్ నోట్ పంపుతారు అమెరికా అధ్యక్షురాలు. దీన్ని సాధించేందుకు ఈథన్ ఎలాంటి సాహసం చేశాడు? ఈ జర్నీలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? తెలియాలంటే మూవీ చూడాల్సిందే.