పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటించిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'హరి హర వీర మల్లు : పార్ట్ వన్ - స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' (Hari Hara Veera Mallu OTT Streaming) ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓటీటీలో సినిమా చూసిన ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఎందుకంటే...
క్లైమాక్స్ మారింది... రన్ టైమ్ తగ్గింది!Hari Hara Veera Mallu OTT Streaming On Amazon Prime Video: థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల లోపు ఓటీటీ వేదికలో వీరమల్లు వచ్చేశాడు. అయితే... థియేటర్లలో విడుదలైన సినిమాకు, ఓటీటీలోకి వచ్చిన సినిమాకు డిఫరెన్స్ ఉంది. థియేట్రికల్ ప్రింట్ రన్ టైం ఆల్మోస్ట్ మూడు గంటలు. ఓటీటీలోకి వచ్చిన సినిమా రన్ టైం రెండు గంటల 33 నిమిషాలు మాత్రమే. ఆల్మోస్ట్ అరగంట సినిమాను కట్ చేశారు.
ఓటీటీలోకి వచ్చిన వీరమల్లు క్లైమాక్స్ కూడా మారింది. థియేటర్లలో చూసిన సినిమా గనుక గుర్తు ఉండి ఉంటే... అందులో బాబీ డియోల్ దగ్గరకు పవన్ కళ్యాణ్ వెళ్తారు. ఆ సమయంలో బీభత్సమైన తుఫాన్ వస్తుంది. అందులో ఇద్దరు చిక్కుకుంటారు. ఒకరి చేతిని మరొకరు పట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ చేతి మీద టాటూ చూసిన బాబీ డియోల్... అతడిని గుర్తుపడతాడు. వీరమల్లుకు ఔరంగజేబుకు మధ్య పోరాటం సెకండ్ పార్ట్ అన్నట్టు సినిమా ముగించారు. కానీ ఓటీటీలోకి వచ్చిన వేరే మల్లు చూస్తే అలా ఉండదు.
మొఘల్ సామ్రాజ్యంలోకి అడుగుపెడుతున్న సమయంలో... అక్కడ సరిహద్దుల దగ్గర హిందువులపై జరుగుతున్న అరాచకాలను చూసి వీరమల్లు చల్లించిపోతాడు. మొఘల్ సైనికులపై తిరగబడతాడు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఊచ కోత మొదలు పెడతాడు. ఆ సన్నివేశంతో సినిమాను ముగించారు.
థియేటర్లలో గనుక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన ప్రింట్ వచ్చి ఉంటే సూపర్ హిట్ అయ్యేదని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఓటీటీ వెర్షన్ తర్వాత మూడు క్లైమాక్స్‌లతో విడుదలైన సినిమాగా 'వీరమల్లు' కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. థియేటర్లలో విడుదల తర్వాత క్లైమాక్స్ మీద విమర్శలు రాగా... కొంత కట్ చేశారు? 'తూఫాన్ వచ్చేస్తుంది' అంటూ వీరమల్లు రాక గురించి ఔరంగజేబు చెప్పే డైలాగుతో సినిమా ముగించారు. ఇప్పుడు మరొక క్లైమాక్స్ తీశారు.