Navdeep On Pradeep Machiraju Marriage: నవదీప్ - ప్రదీప్ మధ్య పెళ్లి గోల, అలా అయితే అయినట్టే

When Pradeep Machiraju is going to Marry?: తెలుగు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో నవదీప్, ప్రదీప్ పేర్లు ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య పెళ్లి డిస్కషన్ వచ్చింది.

Continues below advertisement

తెలుగు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టు తీస్తే... అందులో యంగ్ రెబల్ స్టార్, బాహుబలి ప్రభాస్ పేరు ముందు వరుసలో, అందరి కంటే ముందు ఉంటుందనుకోండి. ఆ తర్వాత పేర్లలో హీరో నవదీప్, స్టార్ యాంకర్ కమ్ హీరో ప్రదీప్ మాచిరాజు పేర్లు తప్పకుండా ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య పెళ్లి డిస్కషన్ వచ్చింది. అఫ్ కోర్స్... ఆడియన్స్ నవ్వుకునేలా ఆ డిస్కషన్ నడిచింది. 

Continues below advertisement

ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్న షో 'సర్కార్'. ఆహా ఓటీటీ కోసం చేస్తున్న షో ఇది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. జూలై 1 నుంచి స్ట్రీమింగ్ కానున్న 'సర్కార్' సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ కోసం నవదీప్, నిహారికా కొణిదెల, సదా, సిమ్రన్ చౌదరి అతిథులుగా వచ్చారు. 

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నవదీప్ గారు వచ్చారు. నాకు చాలా ఆనందం' అని ప్రదీప్ అంటే... 'నన్ను ఎవరైనా పెళ్లి ఎప్పుడని అడిగితే ప్రదీప్ చేసుకున్నాక చేసుకుంటానని చెబుతున్నాను' అని నవదీప్ అన్నారు. అందుకు, బదులుగా ప్రదీప్ మాచిరాజు 'ఇక అయినట్టే. అయిపాయ్' అని అన్నారు. దాంతో సదా, సిమ్రన్, నిహారిక నవ్వేశారు. 'ప్రదీప్‌లు, నవదీప్‌లు...' అంటూ నవదీప్ ఒక ఎక్స్‌ప్రెష‌న్‌ ఇచ్చారు... పెళ్లి చేసుకోరు అన్నట్టు! 

Also Read : కొడుకు బాధ్యత భర్తకు అప్పగించిన కాజల్, వాళ్ళ ఇంట్లో ఎర్లీ మార్నింగ్ సీన్ ఎలా ఉంటుందో చూడండి

'సర్కార్ 2' లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో చూస్తే... ప్రదీప్ మాచిరాజు, నవదీప్ కలిసి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బాగా అందించినట్టు ఉన్నారు. సిమ్రన్ చౌదరితో కలిసి చేసిన సందడి ఆకట్టుకునేలా ఉంది.

Also Read : షూటింగ్‌కు ముందు వెంక‌టేష్‌తో రిహార్సల్స్ చేశా, ఆయన చాలా ఫ్రెండ్లీ - ముకుల్ చద్దా

Continues below advertisement