తెలుగు చిత్రసీమలో హారర్ కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఓంకార్ (Omkar Director) అని చెప్పాలి. 'రాజు గారి గది' సిరీస్ పెద్ద హిట్. ఆ ఫ్రాంచైజీలో వచ్చిన మూడు సినిమాలు భారీ విజయాలు సాధించాయి. టీవీ షోస్ నుంచి సినిమాల వరకు ఓంకార్ ఎదిగిన సంగతి తెలిసిందే. సినిమాలకు దర్శకత్వం వహించడం మొదలు పెట్టిన తర్వాత టీవీ షోలను వదిలి పెట్టలేదు. ఆ రెండు చేస్తూ... ఇప్పుడు ఓటీటీలో కూడా అడుగు పెడుతున్నారు.
ఓంకార్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'మ్యాన్షన్ 24' (mansion 24 web series). దీనిని కళ్యాణ్ చక్రవర్తి, అశ్విన్ బాబుతో కలిసి ఓంకార్ నిర్మించారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar), సత్యరాజ్, అవికా గోర్, బిందు మాధవి, అర్చనా జాయిస్, శ్రీమాన్, రావు రమేష్, అమర్ దీప్, నందు, అయ్యప్ప పి శర్మ ప్రధాన తారాగణం. ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు.
కాళిదాసు జాతీయ సంపద దోచుకున్నారా?
'మ్యాన్షన్ 24'లో కాళిదాసు పాత్రలో సీనియర్ నటుడు సత్యరాజ్ (Actor Sathyaraj) కనిపించనున్నారు. ఆయన కుమార్తెగా వరలక్ష్మీ శరత్ కుమార్, భార్యగా సీనియర్ నటి తులసి నటించారు. జాతీయ సంపదను కాళిదాసు దోచుకున్నారని వార్తల్లో చెబుతారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని కూడా చెప్పారు.
''నేను దేశద్రోహి కూతుర్ని కాదు! నిజాయితీపరుడైన కాళిదాసు కూతుర్ని. అది నేను నిరూపిస్తా'' అని వరలక్ష్మీ శరత్ కుమార్ శపథం చేస్తారు. ''మా అమ్మను మళ్ళీ ఈ లోకంలోకి తీసుకు రావాలంటే మా నాన్న ఏమయ్యారు? అనేది నిజాన్ని వెతకాలి'' అని చెబుతారు. అందుకోసం ఆమె ఏం చేశారు? 'మ్యాన్షన్ 24'కు ఎందుకు వెళ్లారు? అసలు కాళిదాసు పాడుబడ్డ మ్యాన్షన్ కు ఎందుకు వెళ్లారు? అనేది డిజిటల్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి.
పాడుబడ్డ మ్యాన్షన్ కు వెళ్లిన ఎవరూ తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. మరి, తండ్రిని వెతుకుతూ అక్కడికి వెళ్లిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఏం చేసింది? ఆమె ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అవికా గోర్, రావు రమేష్, రాజీవ్ కనకాల, అయ్యప్ప శర్మ పాత్రలు ఏమిటి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
Also Read : తెలుగులో సూపర్ హిట్టైన వెబ్ సిరీస్ సీక్వెల్‌లో కొత్త హీరోయిన్ - స్విమ్మింగ్ పూల్‌లో సీన్స్
అక్టోబర్ 17 నుంచి 'మ్యాన్షన్ 24' స్ట్రీమింగ్!
mansion 24 streaming date : అక్టోబర్ 17 నుంచి 'మ్యాన్షన్ 24' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదిక వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళంలో తెరకెక్కించిన సిరీస్ ఇది. ఇతర భాషల్లో కూడా అనువదించి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ట్రైలర్ చూస్తే... ఓటీటీలో ఓంకార్ కొత్త హారర్ ట్రెండ్ సెట్ చేసేలా ఉన్నారు.
Also Read : 'కన్నూర్ స్క్వాడ్' రివ్యూ : మమ్ముట్టి కొత్త సినిమా ఎలా ఉంది - కార్తీ మూవీనే మళ్లీ తీశారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial