ఆహాలో జూన్ 24వ తేదీ నుంచి ‘మన్మథ లీల’ సినిమా స్ట్రీమ్ కానుంది. ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాను తెరకెక్కించారు. అశోక్ సెల్వన్, సంయుక్త హెగ్డే, రియా సుమన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో ఈ సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా తమిళ వెర్షన్ కూడా ఆహాలోనే స్ట్రీమ్ అవుతుంది.
ఒక యువకుడి జీవితంలో రెండుసార్లు ఒకే తరహా సంఘటనలు జరిగితే వాటి నుంచి అతను ఎలా బయటపడ్డాడు అనేది మన్మథ లీల కథ. కొంచెం అడల్ట్ టచ్ ఉన్న ఈ సినిమాను యూత్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. మానాడు వంటి సూపర్ హిట్ తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన సినిమా ఇది.
ఈ సినిమా దర్శకుడు వెంకట్ ప్రభు త్వరలో నాగచైతన్యతో ఒక సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా నాగచైతన్యకు తమిళనాట డెబ్యూ సినిమా కానుంది. పూజా హెగ్దే ఈ సినిమాలో నాగచైతన్య సరసన నటించనుందని వార్తలు వస్తున్నాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు.