Manjummel Boys OTT Release Update: ఈమధ్య థియేటర్లలో బ్లాక్‌బస్టర్ అవుతున్న సినిమాలు.. ఓటీటీలోకి రావడం కష్టమయిపోయింది. ఇప్పటికే ‘హనుమాన్’ సినిమాకు ఓటీటీ కష్టాలు ఎదురవుతున్నాయి. ఇక మరో మలయాళ బ్లాక్‌బస్టర్ చిత్రానికి కూడా ఓటీటీ కష్టాలు ఎదురవుతున్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ సినిమా మరేదో కాదు.. ‘మంజుమ్మెల్ బాయ్స్’. ముందుగా హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్లలో మలయాళంలోనే విడుదలయిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ సాధించడంతో తెలుగులో కూడా డబ్ అయ్యింది. థియేటర్లలో ఇంత క్రేజ్ సంపాదించుకున్నఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేయడానికి మాత్రం ఏ ప్లాట్‌పార్మ్ ముందుకు రావడం లేదని సమాచారం.
ఎక్కువ డిమాండ్..
‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్రం థియేటర్లలో విడుదలయ్యి దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. మలయాళ మేకర్స్ సత్తా ఏంటో ఈ సినిమా మరోసారి నిరూపించింది అంటూ సోషల్ మీడియాలో దీనికి తెగ ప్రశంసలు దక్కాయి. కానీ ఓటీటీ రిలీజ్ విషయంలో మాత్రం అలా జరగడం లేదట. థియేటర్లలో ఓ రేంజ్‌లో హిట్ అవ్వడంతో ఓటీటీ హక్కులను కాస్త ఎక్కువ రేటుకు అమ్మాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఏవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’ కోసం అంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయడానికి ముందుకు రావడం లేదని సమాచారం. ఇక ‘మంజుమ్మెల్ బాయ్స్’ కొనుగోలుకు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆసక్తి చూపించడం లేదని వార్త సినీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అంతకంటే ఎక్కువ రాదు..
ప్రపంచవ్యాప్తంగా ‘మంజుమ్మెల్ బాయ్స్’కు రూ.130 కోట్ల కలెక్షన్స్ దక్కాయి. ఈ సినిమా కలెక్షన్స్ వేట ఇంకా ముగిసిపోలేదు. ఇప్పటికీ ఈ మూవీని చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. అందుకే ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఓటీటీ హక్కులను రూ.20 కోట్లకు అమ్మాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. కానీ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ మాత్రం దీనికి రూ.10 కోట్లు కంటే ఎక్కువ పెట్టడానికి ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. ‘మంజుమ్మెల్ బాయ్స్’ మాత్రమే కాదు.. మరెన్నో ఇతర సౌత్ సినిమాలు కూడా థియేటర్లలో బ్లాక్‌బస్టర్ అందుకుంటే ఓటీటీ ప్రైజ్‌ను పెంచేస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే రూటును ఫాలో అవుతోంది.
త్వరలో తెలుగులో విడుదల..
ఇండస్ట్రీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక చిత్రం థియేటర్లలో విడుదలయ్యి బ్లాక్‌బస్టర్ టాక్ అందుకుంటే.. దానిని ఓటీటీలో రిలీజ్ చేయడానికి కనీసం రెండు నెలలు అయినా గ్యాప్ ఇస్తున్నారు మేకర్స్. అంత ఆలస్యం అవ్వడంతో సినిమాకు ఎక్కువ ఫ్యాన్సీ ప్రైజ్ పెట్టి కొనుగోలు చేయడం అనవసరం అని భావిస్తున్నాయట ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్. దీనివల్ల ‘మంజుమ్మెల్ బాయ్స్’కు మాత్రమే కాదు.. మరెన్నో ఇతర సినిమాల ఓటీటీ రిలీజ్‌పై కూడా క్లారిటీ లేదని తెలుస్తోంది. ఇక చిదంబరం దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంజుమ్మెల్ బాయ్స్’లో శోభున్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, అభిరామ్, అరుణ్, దీపక్ లీడ్ రోల్స్‌లో నటించారు. మార్చి 15న ఈ మూవీ తెలుగు వర్షన్ థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది.
Also Read: రష్మిక, విజయ్‌ల ‘పింక్ క్యాప్’ సీక్రెట్ - మళ్లీ దొరికిపోయారంటున్న అభిమానులు, ఇదిగో ఫ్రూఫ్!