Sivakarthikeyan's Madharaasi OTT Release Date Locked: కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్, స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబోలో వచ్చిన రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ 'మదరాసి' ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూసిన మూవీ లవర్స్ వెయిటింగ్‌కు తాజాగా చెక్ పడింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పలు తేదీల్లో వస్తుందంటూ రూమర్స్ హల్చల్ చేశాయి. తాజాగా ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది.

Continues below advertisement


ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?


ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' సొంతం చేసుకోగా అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం ఇతర భాషల్లోనూ అందుబాటులోకి ఉండనుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు. 'మీ నిజమైన 'మదరాసి'తో ఓ క్రేజీ జర్నీకి రెడీగా ఉండండి.' అంటూ రాసుకొచ్చారు. 


మూవీలో శివ కార్తికేయన్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటు విద్యుత్ జుమ్వాల్, షబీర్, విక్రాంత్, బిజు మేనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై శ్రీలక్ష్మీ ప్రసాద్ నిర్మించగా... అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు.






Also Read: జ్యువెలరీ యాడ్ కాదు... 'అనగనగా ఒక రాజు' ప్రోమో - నవీన్ పోలిశెట్టి కామెడీ మూవీ వెరైటీగా...


కథ ఏంటంటే?


తమిళనాడుకు గన్ కల్చర్‌ను ఇంట్రడ్యూస్ చేసి భారీగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తుంది ఓ సిండికేట్. ఈ విషయం ఎన్ఐఏకు తెలుస్తుంది. విరాట్ (విద్యుత్ జమ్వాల్), చిరాగ్ (షబీర్ కల్లరక్కల్) అనే ఇద్దరు స్నేహితుల అండర్‌లో 6 ట్రక్కుల్లో ఆయుధాల్ని తరలిస్తుంది ముఠా. ఎన్ఐఏ ఆఫీసర్ ప్రేమ్ (బిజు మేనన్) వీటిని తమిళనాడులోకి ఎంటర్ కాకుండా తన టీంతో విశ్వ ప్రయత్నాలు చేసినా సాధ్యం కాదు. దీంతో ఆయుధాలు నిల్వ ఉంచిన ఫ్యాక్టరీనే పేల్చేయాలని ప్లాన్ చేస్తుంది ఎన్ఐఏ. ఒకరి ప్రాణం ఫణంగా పెడితే తప్ప ఈ ఆపరేషన్ సాధ్యం కాదు.


ముఠాతో జరిగిన గొడవల్లో తీవ్రంగా గాయపడతాడు ఎన్ఐఏ ఆఫీసర్ ప్రేమ్. లవ్ ఫెయిల్యూర్‌తో సూసైడ్ చేసుకోవాలనుకునే రఘు (శివకార్తికేయన్)ను అంబులెన్సులోనే కలుస్తాడు. తన ప్రాణాల్ని లెక్క చేయని రఘునే ఈ ఆపరేషన్‌కు కరెక్ట్ అని భావించిన అతను ఏం చేశాడు?. అసలు రఘును ఈ మిషన్‌‌‌లోకి ఎలా ఎంటర్ చేశారు? రఘుకు రుక్మిణి వసంత్‌కు సంబంధం ఏంటి? ఆపరేషన్‌లో ఎన్ఐఏ టీం సక్సెస్ అయ్యిందా? ఈ ముఠాను రఘు ఎలా అంతం చేశాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.