Pradeep Ranganathan Love Insurance Kompany OTT Streaming Date: కోలీవుడ్ స్టార్, యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ సక్సెస్ స్ట్రీక్‌కు 'లైక్' బ్రేక్స్ వేసింది. మెజారిటీ ఆడియన్స్ ఈ సినిమాను డిస్ లైక్ చేశారు. తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'లైక్'లైక్ అంటే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకుంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పుడు ఓటీటీలో ఆ రెండు భాషలతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.
థియేటర్లలో ఏప్రిల్ 10వ తేదీన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' విడుదలైంది. నాలుగు వారాల వ్యవధిలో ఓటీటీలోకి రానుందీ సినిమా. మే 6న 'లైక్' ఓటీటీ ప్రీమియర్‌కు రానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.
Also Read: 'గాయపడ్డ సింహం' రివ్యూ: ట్రంప్ మీద తరుణ్ యుద్ధం నవ్వించిందా? జేడీతో కామెడీ, సినిమా సంగతేంటి?
Also Read : రొమాంటిక్ డ్రామా 'ఏక్ దిన్' తెలుగు రివ్యూ - బాలీవుడ్‌లో సాయి పల్లవి హిట్ కొట్టారా?
అప్పటికి థియేట్రికల్ రన్ ఎండ్ కదా!'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన హీరోయిన్ కృతి శెట్టి నటించారు. ఎస్.జె. సూర్య ప్రధాన పాత్ర చేశారు. సీమాన్, గౌరీ జి కిషన్ సహా పలువురు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఫ్యూచర్ 2040లో సినిమా కథ సాగుతుంది. థియేటర్లలో సినిమా విడుదలైన తర్వాత మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. ఆడియన్స్ నుంచి కూడా సూపర్ హిట్ పాజిటివ్ టాక్ రాలేదు. ఓటీటీ విడుదల సమయానికి థియేట్రికల్ రన్ ఎండ్ అవుతుందని తెలుస్తోంది.
Also Read : ఓటీటీలోకి 200 కోట్ల రీసెంట్ బ్లాక్ బస్టర్ వాలా 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
