Latest Telugu OTT Releases In May First Week: ఈ వీకెండ్‌లో మూవీ లవర్స్‌కు ఫుల్ జోష్ ఇచ్చేలా కొత్త మూవీస్‌తో పాటు వెబ్ సిరీస్‌లు సైతం రెడీ అవుతున్నాయి. అవార్డ్ విన్నింగ్ మూవీతో పాటు లవ్, కామెడీ ఎంటర్‌టైనర్, పీరియాడికల్ మూవీస్ పలు ఓటీటీల్లో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయబోతున్నాయి. ఆ మూవీస్ లిస్ట్ ఓసారి చూస్తే..
తెలుగులో అడ్వెంచర్ కామెడీ మూవీ
ఇటీవలే మలయాళంలో రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకున్న మూవీ బ్రొమాన్స్ (Bromance). ఈ మూవీకి అర్జున్ డి.జోస్ దర్శకత్వం వహించగా.. మాథ్యూ థామస్, అర్జున్ అశోకన్, మహిమా నంబియార్, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్ కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ 'సోనీ లివ్'లో (SonyLIV) తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
నేరుగా ఓటీటీలోకే 'ముత్తయ్య'..
బలగం, బాపు వంటి చిత్రాలతో మంచి ఫేమ్ సంపాదించుకున్న సుధాకర్ రెడ్డి (Balagam Sudhakar Reddy) ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'ముత్తయ్య' (Muthayya). భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించిన ఈ మూవీ దాదాపు రెండేళ్ల తర్వాత నేరుగా తెలుగు ఓటీటీ 'ఈటీవీ విన్'లో (ETVWin) స్ట్రీమింగ్ అవుతోంది. చిన్నప్పటి నుంచి ఉన్న నాటకాల పిచ్చితో 70 ఏళ్ల వృద్ధుడు నటుడు కావాలని కలలు కంటాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేదే మూవీ స్టోరీ. అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
Also Read: శ్రీలీలతో ఉన్న ఆ క్యూట్ పాప ఎవరో తెలుసా?
పీరియాడికల్ మూవీ 'కోస్టావో'
నవాజుద్దీన్ సిద్ధిఖీ లీడ్ రోల్‌లో తెరకెక్కిన లేటెస్ట్ పీరియాడికల్ మూవీ 'కోస్టావో'. ప్రస్తుతం 'జీ5' వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. 1990లో గోవాలో స్మగ్లింగ్ నెట్ వర్క్ ఛేదించిన కస్టమ్స్ ఆఫీసర్ కోస్టావో ఫెర్నాండెజ్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ప్రియా బాపట్, కిశోర్, హుస్సేన్ కీలక పాత్రలు పోషించారు.
వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్/వెబ్ సిరీస్‌లు
- ఆహా - వేరే లెవల్ (వెబ్ సిరీస్: సీజన్ 2 - తెలుగు), ష్ (వెబ్ సిరీస్ సీజన్ 1- తెలుగు), వరుణన్ (తమిళ్ మూవీ)
- అమెజాన్ ప్రైమ్ వీడియో - 28 డిగ్రీస్ సెల్సియస్ (తెలుగు), ఈఎంఐ (తెలుగు), ఈడీ (మలయాళం), శ్రీగణేష్ (మరాఠీ మూవీ), గ్రాప్టెడ్ (ఇంగ్లీష్ మూవీ), హెర్టిక్ (ఇంగ్లీష్ మూవీ), అనదర్ సింపుల్ ఫేవర్ (ఇంగ్లీష్ మూవీ), లాస్ట్ నైట్ ఆఫ్ ఎమోర్ (ఇటాలియన్ మూవీ), స్కూల్ స్పిరిట్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీజన్ 2)
- సన్ నెక్స్ట్ - బ్లూ స్టార్ (తమిళ్ మూవీ), పర్మన్ (తమిళ్ మూవీ), కాలాపత్తర్ (కన్నడ మూవీ)
- సోనీ లివ్ - బ్లాక్ వైట్ అండ్ గ్రే (తెలుగు, హిందీ వెబ్ సిరీస్), డాక్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీజన్ 1), ది సిటీ ఈజ్ అవర్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీజన్ 1).
- నెట్ ఫ్లిక్స్: ఎక్స్‌టెరిటోరియల్ (ఇంగ్లీష్ మూవీ), విక్డ్ లిటిల్ లెటర్స్ (ఇంగ్లీష్ మూవీ), ది బిగ్గెస్ట్ ఫ్యాన్ (స్పానిష్ మూవీ), ది రోజ్ ఆఫ్ వెర్సైల్స్ (జపనీస్ మూవీ), ది ఫోర్ సీజన్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీజన్ 1), అన్ సీన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీజన్ 2), బ్యాడ్ బాయ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీజన్ 1)
- జియో హాట్ స్టార్ - కుల్ (తెలుగు/హిందీ వెబ్ సిరీస్ సీజన్ 1), టైటానిక్: ది డిజిటల్ రిస్సరక్షన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ).