Manikandan's OTT Release On Zee5: ఆర్జే నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, సెకండ్ హీరోగా, మెయిన్ హీరోగా మారిన మల్టీ టాలెంటెడ్ తమిళ హీరో మణికందన్. 'జై భీమ్' సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుని, పూర్తి స్థాయి హీరోగా మారిన ఈ హీరో 2023లో రిలీజ్ అయిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'గుడ్ నైట్' మూవీతో సోలో హీరోగా ఫస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాపురంలో గురక పెట్టిన చిచ్చు అనే అంశంతో ఈ మూవీ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. తరువాత 'లవర్' మూవీతో సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చి మణి యాక్టింగ్ సింప్లీ సూపర్బ్ అనిపించేలా చేశాడు. ఈ రోజుల్లో ప్రేమ పేరుతో అమ్మాయిలకు లవర్ చూపించే టార్చర్‌ను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఇలా సెలక్టటివ్‌గా స్టోరీలను ఎంచుకుంటూ వెళ్తున్న మణికందన్ తాజాగా 'కుడుంబస్థాన్' (Kudumbasthan) అనే మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకున్నాడు మణికందన్. తాజాగా 'కుడుంబస్థాన్' మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.
ఓటీటీలోకి ఎప్పుడంటే..?
'కుడుంబస్థాన్' మూవీ జనవరి 24న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీకి రాజేశ్వర్ కలిసామి దర్శకత్వం వహించగా, మణికందన్, సాన్వె మేఘన హీరో హీరోయిన్లుగా నటించారు. డైరెక్టర్ రాజేశ్వర్ కలిసామి 'కుడుంబస్థాన్' మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. ప్రసన్న బాలచంద్రన్ తో కలిసి ఆయన స్క్రీన్ ప్లే కూడా రాశారు. సినిమాకారన్ అనే బ్యానర్ పై ఎస్ వినోద్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. వైశాఖ్ ఈ మూవీకి సంగీతం అందించగా, జనవరిలో రిలీజ్ అయిన ఈ మూవీ భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. కమర్షియల్ హిట్‌గా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన 'కుడుంబస్థాన్' మూవీ మార్చి 7 నుంచి 'జీ5' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన వచ్చింది.
Also Read: ఓటీటీలోకి వచ్చేేసిన అజిత్ యాక్షన్ థ్రిల్లర్ 'పట్టుదల' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
'కుడుంబస్థాన్' స్టోరీ
ఈ మూవీ అనేక సమస్యలతో సతమతమవుతున్న ఓ ఫ్యామిలీమ్యాన్ చుట్టూ తిరుగుతుంది. హీరో హీరోయిన్ ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ ఇరువురి కులాలు వేరు కావడంతో రెండు కుటుంబాల పెద్దలు పెళ్లికి ఒప్పుకోరు. దీంతో పెద్దవాళ్లను కాదని పెళ్లి చేసుకుంటారు. కానీ పెళ్లయిన తర్వాత మణికంఠదన్ ఆర్థిక అవసరాలు మరింతగా పెరుగుతాయి. ఎలాగైనా సరే కుటుంబ అవసరాలను తీర్చాలని, దాని కోసం ఉద్యోగంలో మంచి పొజిషన్ లోకి ప్రమోట్ అవ్వాలనే ఆలోచనతో తిరుగుతున్న మణి ఉద్యోగం సడన్ గా ఊడిపోతుంది. కానీ ఈ విషయం ఇంట్లో తెలిస్తే సమస్య అవుతుందని చెప్పకుండానే, వేరే ఉద్యోగాన్ని వెతుక్కుంటూ ఖర్చుల కోసం అప్పు చేస్తాడు. కానీ ఉద్యోగం రాకపోగా, తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో సమస్యలు పెద్దవవుతాయి. ఓవైపు ఆర్థిక సమస్యలు, మరోవైపు చదువుకునే భార్య... ఇలాంటి టైంలో మణికందన్ తన సమస్యలు తీర్చుకోవడానికి ఏం చేశాడు? పరిస్థితిని ఎలా చక్కదిద్దాడు? అన్న విషయాన్ని మేకర్స్ మనసుకు హత్తుకునే విధంగా, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అద్భుతంగా తీర్చిదిద్దారు.