Korean Horror Thriller Ghost Train OTT Streaming : హారర్, సస్పెన్స్ థ్రిల్లింగ్ కంటెంట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొరియన్ మూవీస్‌కు తెలుగులోనూ సూపర్ క్రేజ్ ఉంది. లేటెస్ట్ కొరియన్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే...
తెలుగులోనూ స్ట్రీమింగ్
ఘోస్ట్ హారర్ థ్రిల్లర్ 'ఘోస్ట్ ట్రైన్' (Ghost Train) అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి (Amazon Prime Video) వచ్చేసింది. 2024లో రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. కొరియన్‌తో పాటు తెలుగు, ఇంగ్లీష్, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
ఈ మూవీకి తక్ సే వూంగ్ దర్శకత్వం వహించగా... జూహ్యూన్ యంగ్, జియోన్ బే సూ, చోయ్ బో మిన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. థియేటర్లలో ఆడియన్స్ వెన్నులో వణుకు పుట్టించిన ఈ సినిమా ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ అందుకోనుంది. ఒంటరిగా ఈ మూవీ చూడొద్దంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
స్టోరీ ఏంటంటే?
సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్, ఫేమ్ కోసం ఓ లేడీ యూట్యూబర్ చుట్టూ ఈ స్టోరీ సాగుతుంది. సస్పెన్స్ హారర్ అంథాలజీగా మూవీని రూపొందించారు. స్టోరీ విషయానికొస్తే... పాపులారిటీ, వ్యూస్ కోసం ఎక్కువగా పరితపిస్తుంటుంది దా క్యూంగ్ (జూ హ్యూన్ యంగ్). తన ఛానల్ వ్యూయర్ షిప్ పూర్తిగా పడిపోవడంతో కంటెంట్ అప్‌లోడ్ చేయాలనుకుని హారర్ కంటెంట్‌పై ఫోకస్ చేస్తుంది. ఇప్పటివరకూ ఎవరూ చూడని, ఎవరికీ తెలియని మిస్టరీ ప్లేసెస్ గురించి ఎలివేట్ చేస్తుంది.
ఇందులో భాగంగానే ఎక్కువ మంది మిస్ అయిన, ఎన్నో వింత సంఘటనలు జరిగిన 'గ్వాంగ్లిమ్' అనే హాంటెడ్ సబ్ వే రైల్వే స్టేషన్‌కు వెళ్తుంది. ఆ స్టేషన్ రహస్యాలు తెలుసుకునేందుకు, దెయ్యాల కథలు సేకరించడానికి స్టేషన్ మాస్టర్‌ను కలుస్తుంది. యూట్యూబర్‌కు నాలుగు స్టోరీలు చెబుతాడు. ఆ కథలు విన్న తర్వాత సదరు యూట్యూబర్‌కు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. వ్యూస్ ఉన్న కంటెంట్ కోసం వెళ్లిన ఆమెకు స్టేషన్‌లో ఎదురైన భయానక అనుభవాలేంటి? ఘోస్ట్ ట్రైన్ ఉచ్చులో ఆమె ఎలా చిక్కుకుంది? వెంటాడుతున్న దెయ్యాల బారి నుంచి ఆమె తనను తాను ఎలా కాపాడుకుంది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
