Bellamkonda Sai Sreenivas Kishkindhapuri OTT Platform Locked: యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అందాల అనుపమ జంటగా నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. 

Continues below advertisement

ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్

ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'ZEE5' సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత 'కిష్కింధపురి' ఆ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది. శాటిలైట్ రైట్స్ కూడా 'జీ తెలుగు' సొంతం చేసుకోగా థియేట్రికల్, ఓటీటీ రన్ తర్వాత టీవీలో ప్రీమియర్ కానుంది. మూవీ థియేట్రికల్ రన్ పూర్తైన దాదాపు 6 నుంచి 8 వారాల తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. 

Continues below advertisement

ఈ మూవీలో సాయి శ్రీనివాస్, అనుపమలతో పాటు తనికెళ్ల భరణి, హైపర్ ఆది, శ్రీకాంత్ అయ్యంగార్, మర్కంద్ దేశ్ పాండే, శాండీ మాస్టర్, హినా భాటియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై అర్చన సమర్పణలో సాహు గారపాటి నిర్మించారు. చైతన భరద్వాజ్ మ్యూజిక్ అందించారు. హారర్, థ్రిల్లింగ్, కాస్త కామెడీ అన్నీ కలగలిపి మూవీని తెరకెక్కించారు కౌశిక్. బెల్లంకొండకు ఇది 11వ మూవీ కాగా అనుపమతో ఇంతకు ముందు 'రాక్షసుడు'లో నటించారు.

Also Read: 'మిరాయ్' ఓటీటీ డీల్ ఫిక్స్ - తేజ సజ్జా మంచు మనోజ్ మూవీ స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?

'కిష్కింధపురి' స్టోరీ ఏంటంటే?

రాఘవ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) ఇద్దరూ లవర్స్. వీరికి థ్రిల్లింగ్ టూర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అలా మరో స్నేహితుడు (సుదర్శన్)తో కలిసి ఘోస్ట్ వాకింగ్ పేరుతో హాంటెడ్ హౌసెస్ టూర్స్ నిర్వహణ హాబీగా చేస్తుంటారు. తమకు థ్రిల్ కావాలనుకునే వారికి థ్రిల్ పంచడమే లక్ష్యంగా వారితో కలిసి ఈ టూర్స్ నిర్వహిస్తుంటారు. అలా ఓసారి 11 మందితో కలిసి 'కిష్కింధపురి' అనే ఊరి పరిసరాల్లో 'సువర్ణమాయ' అనే రేడియో స్టేషన్ గురించి తెలుసుకుని అక్కడకు టూర్ ప్లాన్ చేస్తారు.

1989లో పాడుపడిన 'సువర్ణమాయ' రేడియో స్టేషన్ గురించి ఊరిలో కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. అలా హీరో అండ్ గ్యాంగ్ ఆ భవనంలోకి ఎంటర్ అయ్యాక దెయ్యంలా ఓ వాయిస్ వినిపిస్తుంది. తన భవనంలోకి వచ్చిన ఎవరినీ వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తుంది. అలా చెప్పగానే ఈ 11 మంది గ్రూపులో ముగ్గురు చనిపోతారు. ఆ తర్వాత చిన్నారి ప్రాణాన్ని తీయాలనుకుంటుంది దెయ్యం. ఈ విషయం తెలుసుకున్న రాఘవ్ ప్రాణాలకు తెగించి మరీ ఆ దుష్టశక్తికి ఎదురెళ్తాడు. అసలు ఆ రేడియో స్టేషన్‌లో ఉన్నది ఎవరు? ఆత్మ ప్లాష్ బ్యాక్ ఏంటి? ఎందుకు ఆ భవనం మిస్టరీగా మారింది? భవనంలోకి వెళ్లిన వారిని దెయ్యం ఎందుకు హతమారుస్తుంది? చిన్నారి ప్రాణాలను రాఘవ్ కాపాడాడా? తన గ్రూపులోని వారిని కాపాడేందుకు రాఘవ్ ఏం చేశాడు? అనుపమ దెయ్యంలా మారిందా? అసలు వీటన్నింటి వెనుక ఉన్నది ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.