NTR With KCR Scene Trending In Mayasabha Series: ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'మయసభ' విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. దేవా కట్టా, కిరణ్ జయకుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్... ప్రముఖ ఓటీటీ 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సిరీస్ చంద్రబాబు, వైఎస్సార్ పొలిటికల్ లైఫ్ ఆధారంగా రూపొందించారన్న ప్రచారాన్ని డైరెక్టర్ దేవా కట్టా ఖండించినా... ఆడియన్స్ మాత్రం ఆ క్యారెక్టర్స్‌ను అలానే యాప్ట్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్ర పాలిటిక్స్‌లోనే ఓ సంచలనం, దిగ్గజ పాలిటీషియన్స్‌నే స్ఫూర్తిగా తీసుకున్నట్లు సిరీస్ చూసిన ఎవరికైనా ఇట్టే అర్థమవుతోంది.

చంద్రబాబు Vs వైఎస్సార్

కాకర్ల కృష్ణమ నాయుడుగా ఆది పినిశెట్టి, ఎంఎస్ రామిరెడ్డిగా చైతన్యరావు నటించారు. సిరీస్‌లో వీరిద్దరినీ చంద్రబాబు, వైఎస్సార్‌గానే చూస్తున్నారు ఆడియన్స్. స్నేహితులుగా మారిన ఓ ఇద్దరి ప్రయాణం... రాజకీయ బద్ధ శత్రువులుగా ఎలా మార్చింది?, ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ఎలా మార్చింది? అనేదే ప్రధానాంశంగా ఈ సిరీస్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి రోల్స్‌పైనే కాకుండా మిగిలిన వారి రోల్స్‌పైనా సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగుతోంది. కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయిన ప్రతీసారి ఈ క్యారెక్టర్ వారు అయ్యుంటారు వీరు అయ్యుంటారు అంటూ ఆడియన్స్ ఆ రోల్స్‌కు యాప్ట్ చేసుకుంటున్నారు.

ఎన్టీఆర్‌తో కేసీఆర్?

లీడ్ రోల్స్ చంద్రబాబు, వైఎస్సార్‌లతో పాటు కేసీఆర్‌ను కూడా గుర్తు చేసుకుంటున్నారు. సిరీస్‌లో ఓ టాప్ యాక్టర్ పొలిటికల్ లీడర్‌గా మారడాన్ని దేవా కట్టా చూపించారు. ఓ వ్యక్తి ఆయన వద్దకు వచ్చి... 'సార్... నేను మీకు పెద్ద ఫ్యాన్. నా కొడుకుకు కూడా మీ పేరే పెట్టుకున్నా.' అంటూ చెబుతాడు. దీంతో అతను కేసీఆరే అంటూ సోషల్ మీడియాలో వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తున్నారు నెటిజన్లు.

ఎందుకంటే కేసీఆర్ కూడా ఎన్టీఆర్ అభిమాని అని అందరికీ తెలిసిందే. ఆయన కుమారుడికి తారక రామారావు (కేటీఆర్) అని పేరు పెట్టడంతో ఆ వ్యక్తి కేసీఆరే అంటూ కన్ఫర్మ్ చేసేస్తున్నారు. 'కేసీఆర్ రోల్‌ను డైరెక్టర్ దేవా కట్టా బాగా సెట్ చేశారు. సదరు వ్యక్తి కరెక్ట్‌గా సూట్ అయ్యారు.  ఆ సీన్‌లో ఉన్నది కేసీఆరే.' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సిరీస్‌లో పలు సీన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా... ఈ సీన్ ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. వేర్వేరు రోల్స్‌ను పాలిటిక్స్‌లో వేర్వేరు పాత్రలతో అన్వయించుకుంటున్నారు నెటిజన్స్.

Also Read: సీతమ్మోరి లంకా దహనం - పవర్ ఫుల్ యోధురాలిగా స్వీటీ... అసలేంటీ 'ఘాటి'!

ఈ సిరీస్‌లో ఆది పినిశెట్టి, చైతన్యరావులతో పాటు సాయి కుమార్, నాజర్, దివ్య దత్తా, రవీంద్ర విజయ్, తాన్య రవిచంద్రన్, చరిత వర్మ, శంకర్ మహతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రూడోస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 'సోనీ లివ్' ఓటీటీలో అందుబాటులో ఉంది.