Katha Sudha First Story Life Parner Streaming On ETV Win: 'కథా సుధ' పేరిట ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఈటీవీ విన్'  (ETV Win) ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (Raghavendra Rao) పర్యవేక్షణలో ఈ స్టోరీస్ రానున్నాయి. పలువురు కొత్త వారికి ఈ ప్లాట్ ఫాం ద్వారా నటులుగా ఛాన్స్ ఇవ్వనున్నారు.

ఫస్ట్ స్టోరీ ఇదే!

'కథా సుధ'లో (Katha Sudha) భాగంగా ప్రతీ ఆదివారం ఓ సరికొత్త స్టోరీ స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 6 నుంచి స్టోరీస్ స్ట్రీమింగ్ కానుండగా.. ఫస్ట్ స్టోరీకి సంబంధించిన వివరాలను తాజాగా 'ఈటీవీ విన్' సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'లైఫ్ పార్ట్‌నర్' (Life Partner) మొదటి కథ అని తెలిపింది. 'కొన్ని కథలు ఎప్పటికీ చెరిగిపోవు. కొన్ని బంధాలు ఎప్పటికీ విడిపోవు. పాఠశాల నుంచి మీ ఫస్ట్ లవ్ చాలా ఏళ్ల తర్వాత అనుకోకుండా మీ జీవితంలోకి తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది?. ఇది తెలియాలంటే లైఫ్ పార్ట్‌నర్ చూడండి.' అని పేర్కొంది. మరో కొత్త స్టోరీ వెండి పట్టీలు సైతం త్వరలోనే అంటే మరో ఆదివారం స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.

Also Read: ఓటీటీలోకి ఫస్ట్ సీ అడ్వెంచర్ ఫాంటసీ మూవీ 'కింగ్ స్టన్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

కొత్త వారికి ఛాన్స్

పలువురు కొత్త నటీనటులకు ఛాన్స్ ఇవ్వడంతో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో 'ఈటీవీ విన్' కథా సుధను అందుబాటులోకి తెచ్చింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో దీన్ని రూపొందిస్తుండగా.. 17 రోజుల్లో 4 కథలు రూపొందించినట్లు తెలిపారు. ఈటీవీ ద్వారానే తాను దర్శకధీరుడు రాజమౌళిని ఇండస్ట్రీకి పరిచయం చేశానని.. ఇందుకు బహుమతిగా రాజమౌళి తనకు బాహుబలి ఇచ్చాడని ఇటీవల చెప్పారు. తనకు డైరెక్షన్ తప్ప ఏమీ తెలియదని.. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఎంతోమంది ప్రతిభావంతులైన యాక్టర్స్ ఉన్నారని అన్నారు. 'కథా సుధ'లో భాగంగా వారితో కథలు తీసినట్లు చెప్పారు. కొత్త వారిని పరిచయం చేయడంలో ఆనందం ఉంటుందని అన్నారు.

సైలెంట్‌గా వచ్చేసిన హారర్ థ్రిల్లర్

మరోవైపు, ఇదే 'ఈటీవీ విన్'లో ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'మధుశాల' సోమవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి జి.సుధాకర్ దర్శకత్వం వహించగా.. ఎస్ఐఏ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై తమ్ముడు సత్యం నిర్మించారు. కిడ్నాప్ ప్రధానాంశంగా సాగే క్రైమ్ థ్రిల్లర్ మూవీలో మనోజ్ నందం, యానీ, తనికెళ్ల భరణి, రఘుబాబు, గెటప్ శీను, చిన్నా, రవివర్మ, ఇనయా సుల్తానా కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి సెబాస్టియన్ వర్గీస్ సంగీతం అందించారు.