GV Prakash Kumar's Sea Adventure Kingston Movie OTT Release On Zee5: తమిళ మ్యూజిక్ డైరెక్టర్, ప్రముఖ నటుడు జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) లేటెస్ట్ మూవీ 'కింగ్ స్టన్' (Kingston). మార్చి 7న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు తాజాగా ఓటీటీలోకి రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.
ఆ ఓటీటీలో స్ట్రీమింగ్!
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ 'జీ5' (ZEE5) సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజా అప్ డేట్ ప్రకారం ఈ మూవీ ఈ నెల 13 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుంది. అదే రోజు 'జీ తమిళ్' ఛానల్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీకి కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించగా.. జీవీ ప్రకాష్ కుమార్‌తో పాటు హీరోయిన్ దివ్యభారతి చేతన్, అళగమ్ పెరుమాళ్, సాబుమెన్ అబ్దుసమాద్ కీలకపాత్రలు పోషించారు.
Also Read: ఓటీటీలోకి బిగ్గెస్ట్ హిట్ 'కోర్ట్' మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
రూ.20 కోట్ల బడ్జెట్‌తో..
ఈ మూవీని జీ స్టూడియోస్, ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్స్‌పై జీవీ ప్రకాష్ కుమార్, ఉమేష్ కేఆర్ బన్సల్ సంయుక్తంగా నిర్మించారు. తెలుగులో గంగ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రూ.5.35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. లుక్స్, పోస్టర్, ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేసిన థియేటర్లలో మాత్రం ఆడియన్స్‌ను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
స్టోరీ ఏంటంటే?
తమిళనాడులో సముద్ర తీరంలోని తోవత్తూర్ గ్రామంలో ఈ కథ సాగుతుంది. 1982లో జరిగిన ఓ సంఘటన ఆ ఊరి పరిస్థితుల్నే మార్చేస్తుంది. చేపల వేటనే జీవనాధారంగా భావించే ఆ ఊరి ప్రజలు ఎవరూ చేపల వేటకు వెళ్లరు. ఒకవేళ సముద్రంలోకి ఎవరైన మత్స్యకారులు వెళ్తే.. శవాలై తిరిగి వస్తుంటారు. దీంతో సముద్రంలో ఆత్మలు ఉన్నాయని.. ఎవరూ అక్కడికి వెళ్లేందుకు సాహసం చేయరు. ఓ మనిషి అత్యాశ వల్ల ఊరంతటికీ శాపం ఏర్పడిందని ఊరి పెద్దలు చెబుతారు. ఈ క్రమంలో తీరం సైతం మూసేస్తారు. దీంతో ఊరి ప్రజలు ఉపాధి కోల్పోతారు.
ఇదే అదునుగా థామస్ (సబుమాన్ అబ్దుసమాద్) ముఠా తాము చేస్తున్న అసాంఘిక కార్యకలాపాల్లోకి లోవత్తూర్ గ్రామ ప్రజలను లాగుతుంది. కింగ్ స్టన్ (జీవీ ప్రకాష్) సహా కొద్దిమంది ఊరి యువకులు ఆ ముఠాలో పని చేస్తుంటారు. ఈ క్రమంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా థామస్ ముఠా అక్రమాలు వెలుగులోకి వస్తాయి. దీంతో కింగ్ స్టన్ ఆ ముఠాను ఎదిరించి ఊరికి వస్తాడు. ఊరి కట్టుబాట్లను ఎదిరించి మరీ స్నేహితులతో కలిసి సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. ఇదే సమయంలో వారిని ఆత్మలు ఏం చేశాయి?, అసలు సముద్రంలో ఆత్మలు ఉన్నాయా?, ఓ మనిషి అత్యాశ వల్ల ఆ ఊరికి వచ్చిన శాపం ఏంటి? కింగ్ ఆ ఊరి శాపాన్ని తీర్చి మళ్లీ ఉపాధి కలిగేలా చేశాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.