Dhanush's Kara OTT Released Date : కోలీవుడ్ స్టార్ ధనుష్ రీసెంట్ రూరల్ యాక్షన్ థ్రిల్లర్ కర. విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. సరిగ్గా నెల రోజుల టైం గ్యాప్‌లో ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'కర' మూవీ డిజిటల్ రైట్స్ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా... ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు సహా ఇతర భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. సినిమాలో ధనుష్ సరసన మమితా బైజు హీరోయిన్‌గా నటించారు.

వీరితో పాటే కేఎస్ రవికుమార్, కరుణాస్, జయరాం, సూరజ్ వెంజరమూడు, పృథ్వీరాజన్, శ్రీజ రవి తదితరులు కీలకపాత్రలు పోషించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారి కె గణేష్ నిర్మించగా... జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు. 

Also Read : ఎన్టీఆర్ డ్రాగన్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ - 24 గంటల్లోనే న్యూ హిస్టరీ

స్టోరీ ఏంటంటే?

కర స్వామి (ధనుష్) ఓ దొంగ. అడిగితే డబ్బులు ఇవ్వలేదని తండ్రి కోదండం (కేఎస్ రవికుమార్) వద్ద కొట్టేసి ఇంటి నుంచి వెళ్లిపోతాడు. పదహారేళ్లుగా దొంగతనాలు చేస్తూ జీవిస్తుంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మల్లి (మమితా బైజు) కోసం దొంగతనాలు మానేసి కష్టపడి పని చేసుకుని బతకాలని నిర్ణయించుకుంటాడు. ఓ హోటల్ పెట్టాలనుకుని బ్యాంకు లోన్ కోసం ప్రయత్నిస్తుంటాడు. ఊరిలో పొలం పట్టాల కోసం తండ్రి దగ్గరకు వెళ్తాడు.

అక్కడి పరిస్థితి చూసి చలించిపోతాడు. అనుకోని పరిస్థితుల్లో తన తండ్రిని కోల్పోతాడు. ఈ క్రమంలో మళ్లీ దొంగతనాలు చేస్తాడు. స్థానికంగా ఉన్న ముత్తు సెల్వన్ (జయరాం)కు చెందిన పంచవన్ యూనియన్ బ్యాంకుల్ని దోచుకోవడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు కర ఎవరు? డీఎస్పీ భరతన్ (సూరజ్ వెంజరమూడు) ఈ కేసును ఎలా ఛేదించాడు? కర స్వామికి ఆయనకు మధ్య ఉన్న పాత వివాదం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. 

Also Read : మెగా 158 ఈవెంట్‌లో మెగా బ్రదర్స్ - చిరు విత్ పవన్ కల్యాణ్ హ్యాపీ మూమెంట్స్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.