Kannappa Movie OTT Update: పాన్ ఇండియా స్టార్ హీరోలు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలలో కనిపించిన హిస్టారికల్ మైథాలజీ ఫిలిం 'కన్నప్ప'. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్ చేశారు. ఈ చిత్రానికి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీలో వచ్చాక మరోసారి చూడాలని ఆల్రెడీ థియేటర్లలో సినిమా చూసిన ఆడియన్స్, చూడని వాళ్ళు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలని వెయిట్ చేశారు. వాళ్లందరినీ కొన్ని గంటలు ఎదురు చూసేలా చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ.
ఓటీటీలో వచ్చిన కన్నప్ప... ట్విస్ట్ ఏమిటంటే!?సెప్టెంబర్ 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో 'కన్నప్ప' సినిమా స్ట్రీమింగ్ అవుతుందని ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పేర్కొంది.
తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని తెలియజేసింది. సాధారణంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మిడ్ నైట్ 12 గంటల నుంచి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతాయి. కానీ, 'కన్నప్ప' మాత్రం రాత్రి ఓటీటీలోకి రాలేదు. ప్రతి వారం తమ ఓటీటీలో ఏయే సినిమాలు విడుదల అవుతాయనే విషయాన్ని ప్రైమ్ వీడియో చెబుతుంది. ఒక చార్ట్ విడుదల చేస్తుంది. ఆ లిస్టులో 'కన్నప్ప' లేదు. అందువల్ల అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీకి, కన్నప్ప సినిమా టీంకు మధ్య ఏం జరిగిందని వీక్షకులు భావించారు. మైడ్ నైట్ సినిమా రాకపోవడం వల్ల ఏదో అయ్యి ఉంటుందని పుకార్లు షికారు చేశాయి. అయితే కాస్త ఆలస్యంగా సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం పది గంటల నుంచి స్ట్రీమింగ్ మొదలైంది.
Also Read: చిరంజీవి కాళ్ళ మీద పడ్డ యంగ్ హీరో... కొండంత ధైర్యం అంటూ ఎమోషనల్
థియేటర్లలో కలెక్షన్స్ అనౌన్స్ చేయలేదు!'కన్నప్ప'తో విష్ణు మంచుకు మంచి బూస్ట్ లభించింది. దీనికి ముందు ఆయన హీరోగా నటించిన సినిమాలో బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆడలేదు. దాంతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'ను సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. తండ్రి మోహన్ బాబుతో పాటు తన పరిచయాలు వాడి స్టార్ హీరోలను సినిమాలోకి తీసుకు వచ్చారు. భారీ బడ్జెట్ పెట్టి కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశారు. థియేటర్లలో మొదటి రోజు మొదటి ఆట నుంచి సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే కలెక్షన్లు ఎంత అనేది అనౌన్స్ చేయలేదు. థియేటర్లో నుంచి సుమారు 50 కోట్లు వరకు వచ్చాయని సమాచారం. ఓటీటీ, శాటిలైట్ డీల్స్ ద్వారా మరొక 50 కోట్లు వచ్చాయట. మొత్తం మీద సినిమా నుంచి 100 కోట్లు వచ్చాయని బడ్జెట్ వరకు రికవరీ అయినట్లు టాక్.