నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'జెర్సీ' మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath). సాధారణంగా హీరోయిన్లు తొలి సినిమా అంటే కమర్షియల్, గ్లామర్ పాత్రలను ఎంచుకుంటుంటారు. కానీ శ్రద్ధా శ్రీనాథ్ మాత్రం డెబ్యూ మూవీలో తల్లి పాత్రలో కనిపించి తన రూట్ సఫరేట్ అని చాటి చెప్పింది. గత ఏడాది 'కలియుగమ్ 2064' పేరుతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా చేసింది శ్రద్ధా శ్రీనాథ్. ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో 'కాంతార' కిషోర్ కీలక పాత్రలో నటించాడు. ఇప్పుడు ఆ సినిమా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు లేకుండా ఈ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?
ఫ్రీ స్ట్రీమింగ్... ఎందులో అంటే?Kaliyugam 2064 Free Streaming: టీజర్, ట్రైలర్‌లతో హాలీవుడ్ సినిమా ఫీల్‌గాను కలిగిన కలియుగమ్ 2064 థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ తాజాగా యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్, రెంటల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రభాస్ కల్కితో కంపేరిజన్స్...'కలియుగమ్ 2064' తెలుగుతో పాటు తమిళంలో ఒకేసారి రిలీజైంది. రెండు భాషల్లో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రభాస్ కల్కితో ఈ సినిమాకు కంపేరిజన్స్ వచ్చాయి. కలియగమ్ తెలుగు వెర్షన్‌కు సాయికుమార్ వాయిస్ ఓవర్ అందించారు. డాన్ విన్సెంట్ మ్యూజిక్ అందించాడు.
మూడో ప్రపంచయుద్ధం వస్తే...2064లో మూడో ప్రపంచయుద్ధం వస్తుంది. ప్రజలు రెసిడెన్స్, లిబరేటర్స్ అనే రెండు గ్రూపులుగా విడిపోతారు. లిబరేటర్స్‌కు శక్తి (కాంతార కిషోర్) నాయకుడు. రెసిడెన్స్ గ్యాంగ్ చేసిన ఎటాక్‌లో శక్తి మినహా అతడి గ్రూప్ మొత్తం అంతం అవుతారు. ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోయిన శక్తి సేఫ్ హౌజ్‌లోకి ఎంటర్ అవుతాడు. అక్కడ అతడికి పరిచయమైన భూమి (శ్రద్ధా శ్రీనాథ్) ఎవరు? ఆ ట్రాప్ నుంచి వారు ఎలా బయటపడ్డారు? భూమిని చంపాలని శక్తి ఎందుకు అనుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ.
