Janhvi Kapoor First OTT Web Series: అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, నయా అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న కథానాయిక జాన్వీ కపూర్. వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఎన్టీఆర్ జంటగా 'దేవర', రామ్ చరణ్ సరసన 'పెద్ది' సినిమాల్లో నటించారు. హిందీలోనూ ఆమెకు పలు హిట్స్ ఉన్నాయి. ఇప్పుడు వెండితెర నుంచి డిజిటల్ తెరపై అడుగు పెట్టేందుకు జాన్వీ కపూర్ రెడీ అయ్యారు. ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ఎస్ చెప్పారు. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకోండి.

Continues below advertisement

పా. రంజిత్ షో రన్నర్‌గా...జాన్వీ మొదటి వెబ్ సిరీస్!తమిళ వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ తెరపై ఎంట్రీ ఇవ్వడానికి జాన్వీ కపూర్ రెడీ అయ్యారు. ఆ వెబ్ సిరీస్‌కు 'కురత్తి' (Kurathi) టైటిల్‌ ఖరారు చేసినట్లు టాక్. దానికి సర్గుణం దర్శకుడు కాగా... కల్ట్ చిత్రాల దర్శకుడు పా. రంజిత్ షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిసింది. ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందిస్తున్న ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్ ఇది. 

Also ReadChiru Leaks Mega158 Title, Kadiri Movie - చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్

Continues below advertisement

పా. రంజిత్ సినిమాల గురించి తెలుగు, తమిళ ప్రేక్షకులకు తెలుసు. సామాజిక అంశాలకు, అణగారిన వర్గాల గొంతు వినిపించేందుకు ఆయన ప్రాముఖ్యత ఇస్తారు. అందువల్ల, ఈ సిరీస్ కూడా ఆ తరహాలో ఇంటెన్స్ సోషల్ డ్రామాగా సాగుతుందని టాక్.

Also ReadRukmini Vasanth Mollywood Debut - మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?

తమిళ వెబ్ సిరీస్‌లో జాన్వీ కపూర్ పాత్ర ఎంతో విభిన్నంగా ఉండబోతోందని, తన రెగ్యులర్ గ్లామర్ ఇమేజ్‌కు భిన్నంగా సామాన్య గ్రామీణ మహిళగా డీ గ్లామరైజ్డ్ రోల్ చేస్తున్నారని టాక్. సమాజంలోని అణగారిన వర్గాలపై వివక్షకు వ్యతిరేకంగా, సామాన్య ప్రజల హక్కుల కోసం పోరాడే మహిళా పోరాట యోధురాలిగా జాన్వీ కనిపిస్తారని, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రను ఈ సిరీస్‌లో చేస్తున్నారని  సమాచారం.

Also ReadKalki 2 - ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?