Hollywood Horror Thriller OTT Release Date Locked : భాషతో సంబంధం లేకుండా హారర్ థ్రిల్లింగ్ కంటెంట్ మూవీస్ అటు థియేటర్స్, ఇటు ఓటీటీల్లో సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్నాయి. రీసెంట్‌‌గా వచ్చిన హారర్ థ్రిల్లర్ అబ్సెషన్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.2 వేల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.

Continues below advertisement

అటు ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఇండియాలో అబ్సెషన్ దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఇదే తరహాలో మరో హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. మరి ఆ మూవీ ఏంటంటే...

యూట్యూబర్ సంచలనం

Continues below advertisement

ప్రముఖ యూట్యూబర్, 20 ఏళ్ల వయసున్న కేన్ పార్సన్స్ (Kane Parsons) అప్‌లోడ్ చేసిన షార్ట్ ఫిలిమ్స్ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. యంగ్ యూట్యూబర్ టాలెంట్ గుర్తించిన హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ A24... డైరెక్టర్‌గా అతనికే ఛాన్స్ ఇచ్చింది. కేవలం 10 మిలియన్ డాలర్స్ (దాదాపు రూ.95 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ... వరల్డ్ వైడ్ దాదాపు రూ.3,500 (330 మిలియన్ డాలర్స్) కోట్ల వసూళ్లు సాధించింది. ఆ మూవీనే హాలీవుడ్ రీసెంట్ హారర్ థ్రిల్లర్ బ్యాక్ రూమ్స్ (Backrooms).

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'సోనీ లివ్' (Sonyliv) సొంతం చేసుకుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసిన సదరు ఓటీటీ సంస్థ ఆగస్ట్ 7 నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. ఇంగ్లీష్‌తో ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. 'పూర్తిగా కొత్త కోణంలో భయానక అనుభూతిని పొందడానికి సిద్ధంగా ఉండండి.' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 

Also Read : Crime Thrillers OTT : ఒకే ఓటీటీలో ఒకే రోజు మూడు క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?

స్టోరీ ఏంటంటే? 

క్లార్క్ అనే వ్యక్తి ఓ ఫర్నీచర్ షాప్ నడుపుతుంటాడు. తీవ్రమైన వ్యాపార నష్టాలతో మానసిక వేదనకు గురవుతుంటాడు. ఒక రోజు తన ఫర్నీచర్ షాప్ బేస్మెంట్‌లో ఓ వింతైన గోడను చూస్తాడు. దాని గుండా వెళ్తే మరో ప్రపంచంలోకి వెళ్తాడు. ఆ ప్రపంచం పేరే బ్యాక్ రూమ్స్. అక్కడ పసుపు గోడలు, పాత కార్పెట్లు, నిరంతరం శబ్దం చేసే లైట్స్‌తో పాటు ఖాళీ గదులు వాటి దారి గుండా అంతు చిక్కని అడవులు ఉంటాయి. ఆ  ప్రపంచంలోకి వెళ్లి అదృశ్యమైన క్లార్క్ గురించి అతని స్నేహితురాలు, థెరపిస్ట్ మేరీ ఆ భయంకర ప్రపంచంలోకి వెళ్తుంది. అసలు ఆ ప్రపంచం రహస్యం ఏంటి? అదృశ్యమైన క్లార్క్ ఆచూకీని మేరీ కనిపెట్టగలిగిందా? వింతైన ప్రపంచంలో వీరు ఎదుర్కొన్న అనుభవాలేంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Part Timers Series OTT : ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

NOTE :మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.