Vishwak Sen's ENE Repeat First Day Box Office Collections : మాస్ కా దాస్ విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'ENE Repeat' గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ డే సాలిడ్ కలెక్షన్స్ సాధించింది. ఈ మేరకు మేకర్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఈ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ రూ.15.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ తెలిపారు. ఇండియావ్యాప్తంగా రూ.6.80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా... రూ.5.85 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఓవర్సీస్‌లో రూ.4.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది.
2018లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది?'కి ఇది సీక్వెల్ కాగా... ఆ మూవీ లైఫ్ టైం కలెక్షన్స్‌ను సీక్వెల్ తొలి రోజే క్రాస్ చేసినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. అనీషా ఆంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించగా... ఎస్ ఎస్ ఒరిజినల్స్ బ్యానర్‍పై సృజన్ యరబోలు నిర్మించారు.
స్టోరీ ఏంటంటే?
వివేక్ (విశ్వక్ సేన్), కార్తీక్ (శ్రీనాథ్ మాగంటి), కౌశిక్ (అభినవ్ గోమటం), ఉపేంద్ర (వెంకటేశ్ కాకుమాను) చిన్నప్పటి నుంచే బెస్ట్ ఫ్రెండ్స్. స్కూల్ ఎగ్గొట్టి మరీ సినిమాలు చూస్తుంటారు. పెద్దయ్యాక ఎలాగైనా సినిమా తీయాలని కలలు కంటూ ఆ ప్రయత్నంలో ఎన్నో ఇబ్బందులు పడతారు. మొత్తానికి సినిమా పూర్తి చేసినప్పటికీ... అది ప్లాప్ కావడంతో అప్పుల పాలవుతారు. మరోవైపు, ప్రముఖ వైద్యుడి కుమార్తె కీర్తన (శివాత్మిక రాజశేఖర్)కు మెడిసిన్‌పై ఆసక్తి ఉండదు. తండ్రికి తెలియకుండా తనకు ఇష్టమైన సినిమాటోగ్రఫీ నేర్చుకుంటుంది.
అలా, సినిమాటోగ్రాఫర్ కార్తీక్ (శ్రీనాథ్ మాగంటి) దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తుంది. ఆమెను ప్రేమించిన కార్తీక్ తన మనసులో మాట చెప్పే లోపే ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. దీంతో షాక్‌కు గురైన కార్తీక్ ఏం చేశాడు? అతని ఫ్రెండ్స్ ఎలా సాయం చేశారు? సినిమా తీయాలనే వారి కలకు అసలు కారణం ఏంటి? వీళ్లు హిట్ సినిమా తీశారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read : OM Movie OTT : ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ ఎంటర్టైనర్ O.M - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
