Tamannaah's Do You Wanna Partner OTT Release On Amazon Prime Video: మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికే పలు వెబ్ సిరీస్‌ల్లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరో వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇద్దరు మహిళల జర్నీ, సొసైటీలో వారు ఎదుర్కొన్న పరిణామాలే ప్రధానాంశంగా రూపొందించిన 'డు యూ వానా పార్ట్‌నర్' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ ఒరిజినల్ కామెడీ డ్రామా సిరీస్ ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'వాళ్లు ఇక్కడ ఏదో బ్రూటిఫుల్‌తో ఉన్నారు కాబట్టి టోస్ట్ పెంచుతున్నారు.' అంటూ సదరు ఓటీటీ సంస్థ క్యాప్షన్ ఇచ్చింది. ఈ సిరీస్‌ను నందిని గుప్త, అర్ష్, మిథున్ గంగోపాధ్యాయ రచించగా... నిషాంత్ నాయక్, గంగోపాధ్యాయ రూపొందించారు. ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించారు. తమన్నాతో పాటు బాలీవుడ్ హీరోయిన్ డయానా పేంటీ కీలక పాత్ర పోషించారు.
ఇద్దరు స్నేహితుల మధ్య ఆల్కహాల్ స్టార్టప్‌తో భాగస్వాములుగా మారతారు. ఆ తర్వాత వారు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు. పురుషాధిక్య సమాజంలో వారు ఎదుర్కొన్న సమస్యలు, వాటిని అధిగమించిన తీరును ఈ సిరీస్‌లో చూపించారు.