థియేటర్లలో దుమ్ము దులిపిన 'ధురంధర్ 2: ది రివేంజ్' సినిమా (Dhurandhar 2 OTT Release) ఓటీటీలోనూ తన సత్తా చూపిస్తోంది. దాయాది దేశం పాకిస్తాన్‌లోనూ రణవీర్ సింగ్ (Ranvir Singh) సినిమాను విపరీతంగా చూస్తున్నారు. పాకిస్తాన్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ మావియా ఉమర్ ఫరూఖీ సోషల్ మీడియాలో తెలిపిన వివరాల ప్రకారం... నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఈ సినిమా నంబర్ 1 ప్లేసులో ఉంది.

పాకిస్తాన్ ప్రజల దెబ్బకు నెట్‌ఫ్లిక్స్‌ సర్వర్లు క్రాష్!రణవీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ 'ధురంధర్ 2' (Dhurandhar 2 Movie OTT). మే 14వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయ్యింది. ఇండియాలో ఇంకా స్ట్రీమింగ్ మొదలు కాలేదనుకోండి. మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇంటర్నేషనల్ ఓటీటీలో 'ధురంధర్ 2' స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి దాయాది దేశం పాకిస్తాన్‌లో, నెట్‌ఫ్లిక్స్ చార్ట్‌లలో నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. పాక్ కంటెంట్ క్రియేటర్ మావియా ఉమర్ ఫరూఖీ చెప్పిన వివరాల ప్రకారం... ''రణవీర్ సింగ్ సినిమాపై పాక్ ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఓటీటీ స్ట్రీమింగ్ స్టార్ట్ కాగానే... అర్ధరాత్రి సమయంలో ఒకేసారి వేలాది మంది నెట్‌ఫ్లిక్స్‌లో లాగిన్ కావడం వల్ల పాకిస్తాన్‌లో నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు తాత్కాలికంగా క్రాష్ అయ్యాయి'' అని తెలిపారు. 'ధురంధర్ 2'లోని విషయాలు వాస్తవమా? కాదా? అనేది పక్కన పెడితే... రణవీర్ సింగ్ నటన చూడాలని పాకిస్తానీలు ఆత్రుతగా ఉన్నారని అతను పేర్కొన్నారు.

Also Read: Naga Vamsi Vs Asian Suniel - ఖతమ్ చేస్తా బిడ్డా... కొట్టుకోవడం ఒక్కటే తక్కువ - ఛాంబర్ మీటింగ్‌లో నాగవంశీ vs ఏషియన్ సునీల్

ఇండియాలో 'ధురంధర్ 2' ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?Dhurandhar 2 India OTT Release Date: మన దేశంలోని జూన్ 4వ తేదీ నుంచి జియో హాట్‌స్టార్ (JioHotstar) ఓటీటీలో 'ధురంధర్ 2' స్ట్రీమింగ్ మొదలు కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో రా అండ్ అన్ కట్ వెర్షన్‌లో అందుబాటులో ఉన్నట్టు సమాచారం.

Also ReadVeerabhadrudu Collections - తెలుగు రాష్ట్రాల్లో సూర్య బాక్సాఫీస్ స్టామినా ఇంతేనా... వీరభద్రుడు ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?

బాక్స్ ఆఫీస్ బరిలోనూ 'ధురంధర్' భారీ రికార్డులు సృష్టించింది. మొదటి పార్ట్ రూ. 1307 కోట్లు వసూలు చేయగా.... సీక్వెల్ రూ. 1363 కోట్లకు పైగా రాబట్టింది. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడీ తదితరులు నటించారు. భారతీయ గూఢచారి జస్కీరత్ సింగ్ రంగీ (హంజా అలీ మజారీ) పాకిస్తాన్‌లోని లేయారీ ప్రాంతానికి వెళ్లి... భారత దేశానికి ముప్పుగా పరిణమించిన తీవ్రవాదులను ఎలా ధ్వంసం చేశాడనేది కథ. అందుకే పాక్ ప్రజలు సినిమాపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

Photo Gallery: Anasuya Bikini Photos - బికినిలో అనసూయ... ప్రేక్షకులకు బర్త్ డే ట్రీట్