Daawath Promo: బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ అమర్‌దీప్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కుమార్తె సుప్రిత కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఇదే సినిమాతో సుప్రిత హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. దీంతో వీరిద్దరూ కలిసి రీతూ చౌదరీ హోస్ట్ చేసే ‘దావత్’ షోకు వచ్చారు. తాజాగా ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. ఈ ప్రోమోలో అమర్‌దీప్ గురించి ఎవరికీ తెలియని విషయాలు.. రీతూ తెలుసుకొని వచ్చింది. అప్పట్లో అమర్‌దీప్ అసలు ఎలా ఉండేవాడో బయటపెట్టింది. దాంతో పాటు అమర్, సుప్రిత పర్సనల్ లైఫ్ గురించి మరెన్నో ఆసక్తికర విషయాలు మాట్లాడినట్టుగా ప్రోమోలో చూపించారు. 


వాటర్ ట్యాంక్‌లో మందు..


చాలామందికి తెలియని విషయాన్ని ‘దావత్’లో రీతూ రివీల్ చేసింది. అదేంటంటే సురేఖ వాణి.. అమర్‌కు అక్క అవుతుంది. అంటే సుప్రితకు తను మావయ్య అవుతాడని బయటపెట్టింది. దాని తర్వాత తన బ్యాచిలర్ రోజులను గుర్తుచేసుకున్నాడు అమర్. ‘‘అప్పట్లో ఒక అపార్ట్‌మెంట్‌లో ఉండేవాడిని. ఫ్రెండ్స్ అందరం కూర్చొని మందు కొడతాం. మా అమ్మ, నాన్న రేపు వస్తారని తెలిసి ఏం చేయాలో అర్థం కావట్లేదు, బాటిల్స్ దాచాలి అని చెప్పాను. మావాళ్లు మందు మొత్తం వాటర్ ట్యాంక్‌లో పోశారు’’ అంటూ ఒక ఫన్నీ సంఘటనను చెప్పి నవ్వించాడు అమర్. ఇక అప్పట్లో తనతో మాట్లాడని అమ్మాయిలు కూడా కచ్చితంగా తనను చూడాలి అనే పిచ్చి ఉండేదని చెప్పుకొచ్చాడు.


అద్దం పగిలిపోయింది..


‘‘నాతో మాట్లాడకపోయినా నన్ను చూడకపోతే నాకు నచ్చదు. నేను క్లాస్‌లోకి వస్తే నన్ను చూడాలి. అదే పిచ్చి’’ అని చెప్పుకొచ్చాడు అమర్‌దీప్. ఆ పిచ్చి ఒకసారి శృతిమించిందంటూ ఒక ఘటనను గుర్తుచేసుకున్నాడు. ‘‘నేను ఒక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వేరేవాడు వచ్చి ఏదో మాట్లాడితే సడెన్‌గా తను డైవర్ట్ అయిపోయింది. నేను మాట్లాడేవాడిని పిచ్చి నాకొడుకునా అనుకొని కొడితే అద్దం పగిలిపోయింది’’ అంటూ ఇప్పటికీ దానివల్ల తన చేతికి అయిన గాయాన్ని చూపించాడు అమర్. అయితే అమర్‌కు తాను పూర్తిగా భిన్నమని తన గురించి చెప్పుకొచ్చింది సుప్రిత. ‘‘ఆ అమ్మాయి నిన్ను చూడాలి అని నువ్వు కొడతావు. నేను అలా కాదు. ఆ అమ్మాయి.. ఆ అబ్బాయిని ఎందుకు చూస్తుంది అని ఆ అమ్మాయిని వెళ్లి కొట్టిన రోజులు ఉన్నాయి’’ అంటూ ఇద్దరూ తమ జీవితంలో జరిగిన ఆసక్తికర ఘటనలు గురించి పంచుకున్నారు.



ప్రతీసారి చెప్పుదెబ్బలే..


గర్ల్స్ హాస్టల్‌కు వెళ్లి రాళ్లు విసిరేశావంట నిజమేనా అంటూ అమర్‌దీప్‌ను అడిగింది రీతూ. ఇది నీకు ఎవరు చెప్పారు అంటూ రివర్స్ అయ్యాడు అమర్. ‘‘నీ దుప్పటి కథలు కూడా తెలుసు’’ అని రీతూ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు అమర్. అవన్నీ పాత కథలు అని దాని గురించి ఎక్కువగా మాట్లాడలేదు. ఆ తర్వాత కాసేపు ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలిచ్చారు అమర్, సుప్రిత. ముందుగా ‘మనదే ఇదంతా అని మీ లైఫ్‌లో ఎప్పుడు కనెక్ట్ అయ్యారు?’ అంటూ ఒక ఫ్యాన్ ప్రశ్నించాడు. ‘‘అలా అనుకున్న ప్రతీసారి చెప్పు దెబ్బలే పడ్డాయి నాకు’’ అని సమాధానమిచ్చాడు అమర్. 


Also Read: ఇది కిచెన్ షోనా? బెడ్రూమ్ షోనా?- మరీ ఇంత డబుల్ మీనింగ్ ప్రశ్నలా?