Jagamae Sangeetham First Review: ప్రకాష్ రాజ్, మేక శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుష్మిత శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన మ్యూజికల్ వెబ్ సిరీస్ 'జగమే సంగీతం'. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మెగా డాటర్ సుష్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేశారు. సెప్టెంబర్ 4 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది చూసిన మెగాస్టార్ చిరంజీవి రివ్యూ ఇచ్చారు. ఇంతకీ, ఆయన సిరీస్ గురించి ఏం చెప్పారంటే?
బ్యూటిఫుల్ మ్యూజికల్ డ్రామా... ఎంజాయ్ చేశా''అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'జగమే సంగీతం' చూశా. నాకు ఎంతో నచ్చింది. నేను బాగా ఎంజాయ్ చేశా'' అని చిరంజీవి పేర్కొన్నారు. అందమైన మ్యూజికల్ సిరీస్ 'జగమే సంగీతం' అని... సిరీస్‌లో నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ, హృదయానికి హత్తుకునే సంగీతం ఉన్నాయని ఆయన తెలిపారు. ఇదొక చక్కని మ్యూజికల్ సిరీస్ అన్నారు.
'కుమారి 21 ఎఫ్', '18 పేజెస్' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో కర్ణాటక సంగీతం నేపథ్యంలో తెరకెక్కిన మ్యూజికల్ డ్రామా 'జగమే సంగీతం' (Jagame Sangeetham). దర్శకుడిగా ఆయన తొలి వెబ్ సిరీస్ ఇది. దీనితో ఓటీటీ ప్రపంచంలో అడుగు పెట్టారు. ఆయనపై చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ''దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి అద్భుతమైన, ఆసక్తికరమైన సంగీత ప్రపంచాన్ని సృష్టించారు'' అని చిరు తెలిపారు.
Also Read: Supritha Boyfriend - సుప్రీతా బాయ్‌ఫ్రెండ్ కాదు... అతను 'గే' - వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ లేదు
ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అక్షయ్ లగుసాని, సుస్మితా శెట్టి, మధుబాల అద్భుతంగా నటించారని చిరంజీవి ప్రశంసించారు. ''ఇంత చక్కటి సిరీస్‌ను రూపొందించిన సుష్మితా కొణిదెల, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ టీమ్ పట్ల నాకు ఎంతో గర్వంగా ఉందన్నారు. సిరీస్ బృందం అంతటికీ శుభాకాంక్షలు చెప్పారు.
