Chiranjeevi's Mana Shankaravaraprasad Garu OTT Platform Locked : మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు'. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుండగా... ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాక ముందే ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.

Continues below advertisement


ఓటీటీ డీల్ ఫిక్స్


ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'ZEE5' సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, శాటిలైట్ రైట్స్‌ను జీ నెట్‌వర్క్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు బిగ్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతుండగా... రిలీజ్‌కు ముందే భారీ బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత మూవీ ఓటీటీలోకి ఆ తర్వాత టీవీల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.


Also Read : వంద జన్మలకూ మళ్లీ మళ్లీ రజనీలానే పుట్టాలని ఉంది - తలైవా ఎమోషనల్ స్పీచ్‌కు ఫ్యాన్స్ ఫిదా


ట్రెండింగ్‌లో మీసాలపిల్ల


ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన చిరు లుక్స్, మెగాస్టార్ ఎంట్రీ స్పెషల్ వీడియోతో పాటు 'మీసాల పిల్ల' సాంగ్ ట్రెండ్ సృష్టిస్తోంది. సోషల్ మీడియాను ఈ సాంగ్ ఓ ఊపు ఊపేస్తుండగా లక్షల్లో రీల్స్ చేస్తున్నారు. ఇక మిగిలిన పాటల కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మూవీలో చిరు స్టైలిష్, వింటేజ్ లుక్ అదిరిపోయింది. గతంలో మూవీస్ కంటే డిఫరెంట్‌‌గా ఓ సరికొత్త సైలిష్ లుక్‌లో మెగాస్టార్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.


చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారు. వీరితో పాటే వీటీవీ గణేష్, కేథరిన్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.