Vijay Antony's Bhadrakaali OTT Platform Locked: 'బిచ్చగాడు' మూవీతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోని. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా, డైరెక్టర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్‌గానూ సత్తా చాటుతున్నారు. ఎప్పుడూ డిఫరెంట్ స్టోరీ లైన్, కాన్సెప్ట్స్‌తో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసే ఆయన తాజాగా క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'భద్రకాళి'తో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఓటీటీ డీల్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Continues below advertisement

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'భద్రకాళి' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్' సొంతం చేసుకోగా థియేట్రికల్ రన్ తర్వాత మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. నిజానికి ఏ మూవీ అయినా థియేట్రికల్ రన్ అయిన 4 వారాల తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుంది. ఒకవేళ మంచి టాక్ సొంతం చేసుకుంటే ఇంకాస్త్ టైం పడుతుంది. ఈ క్రమంలో 'భద్రకాళి' 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి తమిళంతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Continues below advertisement

Also Read: 'కల్కి 2898AD' నుంచి దీపికా అవుట్ - డైరెక్టర్ నాగ్ అశ్విన్ పోస్ట్ వైరల్... కృష్ణుడి డైలాగ్‌తో...

విజయ్ కెరీర్‌లో ఇది 25వ సినిమా. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని సమర్పణలో అరుణ్ ప్రభు 'భద్రకాళి' మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ ఆంటోని హీరోగా చేయడమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గానూ చేశారు. ఆయనతో పాటు సునీల్ కృపలానీ, వాగై చంద్రశేఖర్, తృప్తి రవీంద్ర, సెల్ మురుగన్, మాస్టర్ కేశవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగులో ఈ మూవీని మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు. 

ఈ మూవీలో స్టైలిష్‌గా ఫ్యామిలీ మ్యాన్‌లా, గ్యాంగ్ స్టర్‌లా డ్యుయెల్ పాత్రను పోషించారు విజయ్ ఆంటోని. అలాగే ఐపీఎస్ అధికారిగానూ కనిపించారు. రూ.190 కోట్ల ఆర్థిక కుంభకోణం చుట్టూ మూవీ సాగనుండగా... అసలు ఆ స్కామ్ వెనుక ఉన్నది ఎవరు? దాన్ని విజయ్ వెలికితీశారా? విజయ్ గ్యాంగ్ స్టర్ లేదా ఐపీఎస్ ఆఫీసరా అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.