Chidambaram's Balan The Boy OTT Release : 'మంజుమ్మల్ బాయ్స్' తర్వాత డైరెక్టర్ చిదంబరం తెరకెక్కించిన లేటెస్ట్ సైకలాజికల్ డ్రామా 'బాలన్ ది బాయ్' (Balan The Boy). జూన్ 19న మలయాళంతో పాటు ఇతర భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

Continues below advertisement

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ZEE5 సొంతం చేసుకోగా... జులై 31 (శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన సదరు ఓటీటీ సంస్థ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.

Continues below advertisement

థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫర్జానా పాలతింగల్, అధిశీషన్ కేఆర్, టొవినో థామస్, మొహమ్మద్ జీనాన్, జీన్ పాల్ లాల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. చిదంబరం దర్శకత్వం వహించగా... వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరించారు. 

Also Read : Gurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?

స్టోరీ ఏంటంటే?

ఓ హత్య కేసులో ముద్దాయిగా (ఫర్జానా పాలతింగళ్) జైలుకు వెళ్తుంది. అక్కడ ఆమెకు ఓ అబ్బాయి పుడతాడు. శిక్షా కాలం పూర్తైన తర్వాత కేరళలోని కన్నూర్ జైలు నుంచి బాబు (అధిశీషన్ కేఆర్)తో కలిసి బయటకు వస్తుంది. ఎలాంటి బంధాలు వద్దనుకున్న తల్లి... మారు పేర్లు పెట్టుకుని వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న పనులు చేస్తుంటుంది. అక్కడ ఎవరికైనా ఏమైనా సందేహాలు వస్తే మకాం మార్చేస్తుంది. అలా ఓ 70 ఏళ్ల ముసలావిడ దగ్గర కేర్ టేకర్‌గా పనికి చేరుతుంది.

కొడుకును మంచి స్కూల్‌లో చేర్పిస్తుంది. ఇకపై జీవితంలో అంతా మంచే జరుగుతుందని అనుకునే తరుణంలో ఒక్కసారిగా ఆమె జీవితం తలకిందులు అవుతుంది. ఇద్దరిని మర్డర్ చేసిందనే ఆరోపణలతో తల్లిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లాడు తన తల్లి కోసం ఎలాంటి అన్వేషణ సాగించాడు? పోలీస్ అధికారి పవిత్రన్ (జీన్ పాల్ లాల్) పిల్లాడిపై ఎందుకు కక్ష కట్టాడు? బాలుడి తల్లి నిజంగా ఆ హత్యలు చేసిందా? చివరకు తల్లీ కొడుకులు ఎలా ఒక్కటయ్యారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. తనదైన జీవితం కోసం ప్రతీ అడుగులో ఓ మహిళ చేసిన పోరాటాన్ని ఎమోషనల్‌గా చూపించారు.

Also Read : Maa Inti Bangaram OTT : ఓటీటీలోకి మా ఇంటి బంగారం - సమంత యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

NOTE :మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.