Harsha Chemudu's Bakasura Restaurant OTT Release On Sunnxt: మరో హారర్ కామెడీ థ్రిల్లర్ ఓటీటీ ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ కమెడియన్ వైవా హర్ష ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ థ్రిల్లర్ 'బకాసుర రెస్టారెంట్'. ఎస్ జే శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఓటీటీ రిలీజ్‌పై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ ఈ నెల 12 నుంచి ప్రముఖ ఓటీటీ 'సన్ నెక్స్ట్' లోకి అందుబాటులోకి రానుంది. 'ఐదుగురు యువ ఆత్మలు. ఓ చీకటి శక్తి.' అంటూ సదరు ఓటీటీ సంస్థ క్యాప్షన్ ఇచ్చింది. హారర్, థ్రిల్లర్, మైథాలజీ కాన్సెప్ట్‌తో మూవీని తెరకెక్కించారు. సినిమాలో వైవా హర్షతో పాటు ప్రవీణ్, కృష్ణ భగవాన్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడ రామ్ కీలక పాత్రలు పోషించారు. 

Also Read: పిల్లలు, గుండె ధైర్యం లేని వారు మూవీకి రావొద్దు - 'కిష్కిందపురి' టీం రిక్వెస్ట్

స్టోరీ ఏంటంటే?

పరమేశ్వర్ (ప్రవీణ్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేస్తుంటాడు. అతను సొంతంగా రెస్టారెంట్ బిజినెస్ చేయాలని కలలు కంటుంటాడు. ఇష్టం లేకున్నా జాబ్ చేస్తూ రూమ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటాడు. తన ఫ్రెండ్స్‌తో తన డ్రీమ్ పంచుకోగా డబ్బులు సంపాదించేందుకు యూట్యూబ్‌లో దెయ్యం వీడియోలు చేద్దామంటూ సలహా ఇస్తారు. అలా దెయ్యంపై ఫస్ట్ వీడియో చేయగా వైరల్ అవుతుంది. దీంతో రెండో వీడియో ఇంకా పాపులర్ చెయ్యాలంటూ ఓ పాత భవనంలోకి వెళ్తారు.

అక్కడ దొరికిన ఓ బుక్ ఆధారంగా పూజలు చేస్తారు. ఈ క్షుద్రపూజతో బక్క సూరి (వైవా హర్ష) అనే ఆత్మ బయటకు వస్తుంది. దీంతో వారంతా ఆటలు ఆడేందుకు ప్రయత్నిస్తారు. ఓ నిమ్మకాయలో ఆ ఆత్మ ప్రవేశించగా దాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న టైంలో పరమేశ్వర్ స్నేహితుడు అంజిబాబు (ఫణి) శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుంది. దానికి ఆకలి ఎక్కువ. ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా ఒకటే తినేస్తుంది. మరి ఆ ఆత్మను వారంతా కలిసి ఎలా అతని శరీరం నుంచి వెళ్లగొట్టారు? అసలు బక్క సూరి ఎవరు? పరమేశ్వర్ రెస్టారెంట్ కల నెరవేరిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.