Azadi 501 Web Series Release Date: సుమారు పదేళ్ళ క్రితం జరిగిన ఫ్రీడమ్ 251 స్కామ్ గుర్తు ఉందా? స్మార్ట్ ఫోన్స్ యుగం మొదలు అవుతున్న రోజులు... జస్ట్ 251 రూపాయలకు అన్ని ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ ఇస్తామన్న వచ్చిన ప్రకటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చాలా మంది డబ్బులు కట్టారు. చివరకు ఎవరికీ ఫోన్ రాలేదనుకోండి. ఇప్పుడు ఆ స్కామ్ నేపథ్యంలో 'ఆజాదీ 501' వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఆ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది ఆహా ఓటీటీ.
జూలై 29 నుంచి 'ఆజాదీ 501' స్ట్రీమింగ్ Azadi 501 Streaming Platform Release Date: ఆహా ఓటీటీ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందిన ఒరిజినల్ సిరీస్ 'ఆజాదీ 501'. కొన్ని రోజుల క్రితం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన ఆహా... ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది. జూలై 29వ తేదీ నుంచి తమ ఓటీటీలో సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంది.
'ఆజాదీ 501' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ పోస్టర్ గమనిస్తే... 'డిజిటల్ రివల్యూషన్, స్మార్ట్ ఫోన్ @ 501' అని ఓ పేపర్ క్లిప్పింగ్ కనబడుతుంది. 'ఫ్రీడమ్ 251'ను 'ఆజాదీ 501' చేశారన్నమాట. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ... హిందీలో ఆజాదీ అంటారు. అదీ సంగతి.
క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌గా 'ఆజాదీ 501'Azadi 501 Web Series Concept: తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్, అదీ 251 రూపాయలే అని ప్రకటన రావడంతో ఆ ఫోన్ సొంతం చేసుకోవడానికి చాలా మంది ఎగబడ్డారు. సుమారు ఎనిమిది కోట్ల మంది ఆ ఫోన్ కోసం రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. డబ్బులు కట్టారు. రూ. 20 కోట్లకు పైగా మోసం జరిగింది. అయితే, ఒక్కరికి కూడా ఫోన్ అందలేదు. చివరకు, అది పెద్ద కార్పొరేట్ ఫ్రాడ్ అని తేలింది. అప్పట్లో జరిగిన స్కామ్ ఆధారణంగా క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'ఆజాదీ 501'ని తెరకెక్కించినట్టు తెలిసింది.
వంశీ రంగిశెట్టి దర్శకత్వం వహించిన 'ఆజాదీ 501'ను రచన రెడ్డి ములుముడి ప్రొడ్యూస్ చేశారు. హర్షవర్ధన్, 'సై' సినిమా ఫేమ్ శశాంక్, దర్శకుడు తరుణ్ భాస్కర్ తల్లి డి. గీతా భాస్కర్, రాకీ కృష్ణ, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. మరి ఈ సిరీస్ రిలీజ్ తర్వాత స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
