Ayalaan OTT Release Update: ఎప్పుడూ డిఫరెంట్ జోనర్ సినిమాలను చేస్తూ.. తన ప్రయోగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు హీరో శివకార్తికేయన్. తను నటించే ప్రతీ సినిమా ఒకదానితో మరొకటి సంబంధం లేని కథలనే ఎంచుకుంటాడు. అలా తాజాగా ఏలియన్ కథతో ‘అయాలన్’ అనే సినిమాతో ప్రేక్షఖుల ముందుకు వచ్చాడు శివకార్తికేయన్. ఈ మూవీ తమిళనాడులో విడుదలయ్యి మంచి హిట్‌ను సాధించింది. ఇంతలోనే ‘అయాలన్’ ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యాయి. ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఎవరు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేదానిపై రూమర్స్ వైరల్ అవుతున్నాయి.


ఓటీటీ పార్ట్‌నర్ ఎవరంటే..?


శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘అయాలన్’ ఓటీటీ రైట్స్‌ను సన్ నెక్స్‌ట్ సొంతం చేసుకుందని సమాచారం. ఇంతకు ముందు కూడా  ఈ హీరో నటించిన చాలావరకు సినిమాల హక్కులను సన్ నెక్స్‌టే దక్కించుకోవడం విశేషం. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా తమిళంలో విడుదలయ్యింది ‘అయాలన్’. తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేయాలని సన్నాహాలు చేసినా.. సంక్రాంతికి తెలుగులో భారీగా పోటీ జరగడంతో.. తమిళ డబ్బింగ్ సినిమాకు థియేటర్లు దొరకడం కష్టమని.. ఒకవేళ దొరికినా చూడడానికి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ‘అయాలన్’ తెలుగు రిలీజ్‌ను మేకర్స్ పోస్ట్‌పోన్ చేశారు.


తెలుగులో విడుదలకు సిద్ధం..


ఇక తెలుగులో సంక్రాంతి హడావిడి అంతా కాస్త తగ్గడంతో జనవరి 26న ‘అయాలన్’ తెలుగు వర్షన్ థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. తెలుగు వర్షన్ విడుదలయ్యి నెలరోజులు అవ్వక ముందే ఈ మూవీ ఓటీటీలోకి రానుందని టాక్ మొదలయ్యింది. ఫిబ్రవరి 16న ‘అయాలన్’ సన్ నెక్స్‌ట్‌లో విడుదల కానుందని సమాచారం. ఈ విషయం గురించి మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. కోలీవుడ్ సర్కిల్లో మాత్రం ‘అయాలన్’ ఓటీటీ రిలీజ్ గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ ఒక్క తమిళనాడులోనే రూ.50 కోట్ల కలెక్షన్స్ మార్క్‌ను టచ్ చేసింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ సంతోషంగా స్పెషల్ పోస్టర్‌తో ప్రకటించింది.






కొత్త దర్శకుడితో ప్రయోగం..


‘అయాలన్’తో దర్శకుడిగా పరిచయమయ్యాడు రవికుమార్. దర్శకుడు కొత్తవాడే అయినా.. తన విజన్‌పై నమ్మకంతో రెమ్యునరేషన్‌ను తగ్గించుకొని మరీ ఈ సినిమాలో యాక్ట్ చేశాడు శివకార్తికేయన్. రెండేళ్ల క్రితం ఈ మూవీ షూటింగ్ మొదలయ్యింది. షూటింగ్ పార్ట్ వరకు త్వరగానే పూర్తయినా కూడా విజువల్స్, గ్రాఫిక్స్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతోనే పోస్ట్ ప్రొడక్షన్‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది టీమ్. వారు నమ్మినట్టుగానే ‘అయాలన్’ విజువల్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఏలియన్, మనిషికి మధ్య ఫ్రెండ్‌షిప్ అనే కథ కూడా ప్రేక్షకులకు డిఫరెంట్‌గా అనిపించింది. ఇలాంటి ఒక డిఫరెంట్ కథలో సరిపడా కామెడీని కూడా జోడించి మూవీని ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించాడు దర్శకుడు రవికుమార్.


Also Read: చెల్లి ఎంగేజ్‌మెంట్‌లో అక్క హడావిడి - వైరల్ అవుతున్న సాయి పల్లవి డ్యాన్స్ వీడియో