జేమ్స్ కామెరూన్ సైన్స్ ఫిక్షన్ సినిమా 'అవతార్: ఫైర్ అండ్ యాష్' ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. డిసెంబర్ 19, 2025న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను పాండోరా ప్రపంచంలోకి తిరిగి తీసుకు వెళ్ళాయి. ఈ సినిమా థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ ముగిసింది. అభిమానులు ఈ సినిమా OTTలో ఎప్పుడు, ఎక్కడ విడుదల అవుతుందా? అని తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఓటీటీలో 'అవతార్ 3' రిలీజ్ ఎప్పుడంటే?కలెక్షన్లు బాగా వచ్చాయి కానీ జేమ్స్ కామెరూన్ 'అవతార్: ఫైర్ అండ్ యాష్'కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. భారత దేశంలో జియో హాట్‌స్టార్ ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్ అవుతుందని తెలిసింది. అయితే నిర్మాతలు ఇంకా దీని గురించి అధికారికంగా ప్రకటించలేదు. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఈ సినిమా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో వస్తుంది. ఈ ఫ్రాంచైజీలో రెండో సినిమా 'అవతార్ 2' థియేటర్లలో విడుదలైన ఆరు నెలల తర్వాత ఓటీటీలో విడుదలైంది. ఇప్పుడు 'అవతార్ 3' కూడా అలాగే రావచ్చు.
Also Read: 'రాజా సాబ్' ముందు కాలర్ ఎగరేసిన మెగాస్టార్ సినిమా... ఇండియాలో నాలుగు రోజుల నెట్ కలెక్షన్ ఎంతంటే?
అవతార్: ఫైర్ అండ్ యాష్' గురించి...'అవతార్: ఫైర్ అండ్ యాష్'లో జాక్ సులీ, నెయితిరి తమ కుటుంబంతో కలిసి అగ్నిని వెదజల్లే నావి తెగ, యాష్ పీపుల్ అని పిలువబడే తెగ, మానవ ఆక్రమణదారులతో పోరాడతారు. ఈ చిత్రంలో సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగోర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్ నటించారు. ఉనా చాప్లిన్, కేట్ విన్స్లెట్, క్లిఫ్ కర్టిస్, జోయెల్ డేవిడ్ మూర్, సిసిహెచ్ పౌండర్ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు.
ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 1.2 బిలియన్ అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ వసూలు చేసింది. జేమ్స్ కామెరూన్ ఇప్పటికే 'అవతార్ 4', 'అవతార్ 5'లను ప్రకటించారు. వాటిని 2029, 2031లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.