Aranmanai 4 OTT Platform Release Date: వంద కోట్లు... బాక్సాఫీస్ బరిలో అక్షరాలా వంద కోట్లు కొల్లగొట్టిన తమిళ హారర్ కామెడీ 'అరణ్మనై 4'. ఈ చిత్రాన్ని తెలుగులో 'బాక్' (Baak Telugu Movie OTT) పేరుతో విడుదల చేశారు. తమిళ, తెలుగు భాషల్లో మే 3న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఏ ఓటీటీలో సినిమా చూడాలో తెలుసా?


నాలుగు భాషల్లో 'అరణ్మనై 4' స్ట్రీమింగ్!
Aranmanai 4 OTT Release On Disney Plus Hotstar: 'అరణ్మనై 4'... 'బాక్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది. ఈ రోజు (జూన్ 21వ తేదీ) నుంచి వీక్షకులకు సినిమాను అందుబాటులోకి తెచ్చింది. 


తెలుగు, తమిళంతో పాటు మరో రెండు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కన్నడ, మలయాళంలోనూ 'అరణ్మనై 4'ను విడుదల చేసిన హాట్ స్టార్ ఓటీటీ. తమిళ ప్రేక్షకుల నుంచి థియేటర్లలో ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. మరి, ఓటీటీలో ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.


Also Read: 'బాక్' మూవీ రివ్యూ: ఆత్మగా మారిన తమన్నా - తమిళ హారర్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?






అస్సామీ దెయ్యం ఏం చేసిందో చూడాలి!
హారర్ కామెడీ ఫ్రాంచైజీ 'అరణ్మనై'లో నాలుగో సినిమా కోసం అస్సామీ దెయ్యాన్ని తెరపైకి తీసుకు వచ్చారు సుందర్ సి. అస్సాంలోని ఓ పురోహితుడు, అతని కుమార్తె కలిసి గుడికి వెళుతుండగా... నదిలోని బోటులో ఉన్నప్పుడు అమ్మాయికి గాయం అవుతుంది. ఆ రక్తం నీటిలో పడి రూపం మార్చుకునే దెయ్యం 'బాక్'కి ప్రాణం పోస్తుంది. ఆ దెయ్యం ఏం చేసిందో సినిమాలో చూడాలి. అస్సామీ దెయ్యం సౌత్ ఇండియాలోని ఓ ఊరికి ఎందుకు వచ్చింది? ఆమె నుంచి తన మేనకోడలు, మేనల్లుడిని కాపాడుకోవడానికి హీరో ఏం చేశాడు? అనేది ఆసక్తికరం.


Also Read: ఆహాలోకి వచ్చిన Rasavathi - పవన్ కళ్యాణ్ 'ఓజీ' ఫేమ్ అర్జున్ దాస్ హీరోగా నటించిన Romantic Thriller



సుందర్ సి సిస్టర్ రోల్ చేసిన తమన్నా!
హారర్ కామెడీ సినిమాలు తీస్తూ వరుస విజయాలు అందుకుంటున్న సుందర్ సి కథానాయకుడిగా నటించడంతో పాటు 'బాక్' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో (Aranmanai 4 Telugu) ఆయన సిస్టర్ రోల్ చేశారు తమన్నా భాటియా. రాశీ ఖన్నా డాక్టర్ రోల్ చేశారు. పతాక సన్నివేశాల్లో వచ్చే ఒక పాటలో సుందర్ సి సతీమణి, సీనియర్ హీరోయిన్ ఖుష్బూతో పాటు మరొక హీరోయిన్ సిమ్రాన్ డ్యాన్స్ చేశారు. అమ్మవారి నేపథ్యంలో వచ్చే ఆ పాటకు మంచి స్పందన వచ్చింది. 


తెలుగు వెర్షన్ కోసం 'వెన్నెల' కిశోర్ కామెడీ
'అరణ్మనై 4' / 'బాక్' స్పెషాలిటీ ఏమిటంటే... తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమాలో టాలీవుడ్ కమెడియన్లతో కామెడీ ట్రాక్ సపరేట్‌గా షూట్ చేశారు. తమిళంలో 'వీటీవీ' గణేష్ కార్పెంటర్ రోల్ చేయగా... యోగిబాబు మేస్త్రిగా కనిపించారు. తెలుగులో ఆ క్యారెక్టర్లను శ్రీనివాస రెడ్డి, 'వెన్నెల' కిశోర్ చేశారు. విమర్శకుల నుంచి ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయినా సరే వందకోట్లు కొల్లగొట్టడం విశేషం.