ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) తన కెరీర్‌లో చాలా వరకు ప్రయోగాత్మక చిత్రాలే చేశారు. రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసినా కూడా తనకు వీలైనంత వరకు కొత్త కాన్సెప్ట్‌లను ఎంచుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ‘శబ్దం’ మూవీ (Sabdham Movie)ని చేశాడు. ‘వైశాలి’తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆది పినిశెట్టి అదే కోవలో ‘శబ్దం’ చేశాడు. కానీ ఆయన చేసిన సౌండ్ ఆడియెన్స్‌కి అంతగా ఎక్కలేదు. నీటితో దెయ్యం కాన్సెప్ట్‌ను జోడించి తీసిన వైశాలి బాగానే క్లిక్ అయింది. కానీ సౌండ్స్‌తో దెయ్యంని కనెక్ట్ చేసి తీసిన ‘శబ్దం’ మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.

మామూలుగా అయితే హిట్టైనా, ఫ్లాపైనా కూడా దాదాపు అటూ ఇటూ నెల రోజులకే ఓటీటీలోకి సినిమాలు వస్తున్నాయి. కానీ శబ్దం మాత్రం ఏడాది దాటి తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం అవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. అఖిల్ అక్కినేని నటించిన 'ఏజెంట్' అయితే ఎప్పుడు ఓటీటీలోకి వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ 'శబ్దం' (Sabdham Movie OTT Platform) మూవీ సైతం రీసెంట్‌గానే జీ5లోకి (Zee5 OTT) వచ్చింది. ఏడాది అయిన తరువాత ఈ మూవీని ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు.

Also ReadUstaad Bhagat Singh Collections: 'ఉస్తాద్' కలెక్షన్లకు 'ధురంధర్ 2' బ్రేకులు... సోమవారం పవన్ సినిమాకు షాక్... ఐదు రోజుల నెట్ ఎంతంటే?

ప్రస్తుతానికి కేవలం తమిళ భాషలో అందుబాటులో ఉందీ 'శబ్దం'. మరి మున్ముందు ఇతర భాషల్లోనూ లభ్యం అవుతుందా? లేదా? అన్నది తెలియడం లేదు. హీరోగా, విలన్‌గానూ ఆది కెరీర్ అంత గొప్పగా ఏమీ కనిపించడం లేదు. చివరగా 'అఖండ 2'లో ఆది విలన్‌గా కనిపించాడు. ఆదికి ఆ సినిమా మైలేజ్ ఇవ్వలేకపోయింది.

Also ReadDhurandhar 2 Collections: ఎనిమిది బాలీవుడ్ సినిమాల రికార్డులు బీట్ చేసిన 'ధురంధర్ 2'... రణవీర్ సినిమా దూకుడు

హీరోగా, విలన్‌గా ఇప్పుడు ఆది పినిశెట్టి ఏమంత ఫాంలో లేరు. నిక్కీ గల్రానితో పెళ్లి తరువాత ఆది కూడా సినిమాల్ని తగ్గించినట్టుగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ జోడి హాయిగా వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేస్తోంది. అయితే ఈ జోడి మళ్లీ తెరపైకి రానుంది. 'మరకతమణి 2' మూవీని ఆల్రెడీ ఆది, నిక్కీ గల్రానీ ఓకే చేసినట్టుగా సమాచారం.

Also Read: Rajinikanth On Dhurandhar 2: బాక్సాఫీస్‌ కా బాప్... ప్రతీ భారతీయుడు చూడాల్సిన చిత్రం.. ‘ధురంధర్ 2’పై రజనీ