30 Weds 21: క్రేజీ వెబ్ సిరీస్.. '30 వెడ్స్ 21' సీజన్ 2 ఫస్ట్ లుక్..

'30 వెడ్స్ 21' వెబ్ సిరీస్ అభిమానులకు ఇప్పుడొక గుడ్ న్యూస్. ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ రెడీ అవుతోంది.

Continues below advertisement

గత ఏడాది లాక్ డౌన్ లో విడుదలైన వెబ్ సిరీస్ '30 వెడ్స్ 21'. ఈ వెబ్ సిరీస్ అన్ని రకాల రికార్డులను బ్రేక్ చేసి న్యూ ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీగా నిలిచింది. ఈ ఫ్రెష్ కాన్సెప్ట్‌తో వచ్చిన వెబ్ సిరీస్ లాక్ డౌన్ లో అందరినీ అలరించింది. చైతన్య, అనన్యల జోడికి యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

Continues below advertisement

'30 వెడ్స్ 21' వెబ్ సిరీస్ అభిమానులకు ఇప్పుడొక గుడ్ న్యూస్. ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ రెడీ అవుతోంది. అసమర్థుడు, మనోజ్ పీ సంయుక్తంగా రెండో సీజన్ కాన్సెప్ట్‌ను రాయగా.. పృథ్వీ వనం దర్శకత్వం వహించారు. రెండో సీజన్ త్వరలోనే విడుదల కానుంది. ఈరోజు ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు.

చైతన్య, అనన్య ఇద్దరూ కూడా ఈ పోస్టర్‌లో రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్‌తోనే రెండో సీజన్ మీద పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లోనే టీజర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జనవరి 31న వెబ్ సిరీస్ రెండో సీజన్‌కు సంబంధించిన టీజర్ రాబోతోంది.

జోస్ జిమ్మి సంగీతాన్ని అందించగా.. ప్రత్యక్ష్ రాజు కెమెరామెన్‌గా, తారక్ సాయి ప్రతీక్ ఎడిటింగ్ అండ్ డిజైనింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. మహేందర్, దివ్య, వీరభద్రం, శ్రీ కుమారి కీలకపాత్రలు పోషించారు. 

 

Continues below advertisement