విశ్వక్ సేన్ (Vishwak Sen) కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'ఓరి దేవుడా' (Ori Devuda Telugu Movie). తమిళంలో అశోక్ సెల్వన్, 'గురు' ఫేమ్ రితికా సింగ్ జంటగా నటించిన 'ఓ మై కడవులే' సినిమాకు రీమేక్ ఇది. ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించిన అశ్వత్ మారిముత్తు తెలుగు సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో విశ్వక్ సేన్‌కు జంటగా హీరోయిన్ మిథిలా పాల్కర్ (Mithila Palkar) నటించారు.
తమిళ సినిమా 'ఓ మై కడవులే'లో మోడ్రన్ భగవంతుని పాత్ర ఒకటి ఉంటుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి దేవుడి ఆ రోల్ చేశారు. తెలుగులో ఆ పాత్రను విక్టరీ వెంకటేష్ చేస్తున్నారు. 'లవ్ కోర్ట్'లో కేసులు పరిష్కరించే వ్యక్తిగా ఆయన కనిపించనున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. తన స్నేహితురాలిని పెళ్లి చేసుకున్న హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనేదే ఈ సినిమా.
ట్రైలర్ చివర్లో 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వచ్చిందా..!' అంటూ హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ మొత్తం ఫన్ తో నింపేశారు. లవ్ డ్రామా కూడా ఉంది. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. కచ్చితంగా యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా సినిమా ఉంటుందనిపిస్తుంది.
దీపావళికి 'ఓరి దేవుడా' విడుదల
'ఓరి దేవుడా' సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర బృందం తెలిపింది. దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 21న విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. హీరోగా విశ్వక్ సేన్ 6వ చిత్రమిది. వెంకటేష్, ఆయన కాంబినేషన్ సీన్స్ బాగా వచ్చాయని యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం.
'ఓరి దేవుడా' చిత్రానికి పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, 'దిల్' రాజు నిర్మాతలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం డైలాగులు రాస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తుండగా... ఎడిటర్‌గా విజయ్, సినిమాటోగ్రాఫర్‌గా విదు అయ్యన్న బాధ్యతలు నిర్వర్తించారు.
Also Read : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?
Also Read : వేలెత్తి చూపిస్తూ, రక్తం అమ్ముకొని బతుకుతున్నానన్నారు - చిరు ఎమోషనల్ కామెంట్స్!