Nuvvunte Naa Jathaga Serial Today Episode: మిధునకు జ్వరం రావడంతో రిషి ఆస్పత్రికి తీసుకెళ్తాడు.అక్కడ  రిషి చేసే హడావుడి చూసి ఫీవర్‌ నీకు అనుకున్నాని డాక్టర్ అంటుుంది.తనకు జ్వరం వస్తే నాకు కంగారుగానే ఉంటుంది కదా డాక్టర్ అని రిషి అంటాడు. దీంతో డాక్టర్‌ మిధునకు జ్వరం చెక్‌ చేస్తుంది. జ్వరం వచ్చిందని ఇంజెక్షన్ చేస్తానంటే కూడా  రిషి హడావుడి చేస్తాడు. దీంతో ఆమెఅతన్నిబయట ఉండమని చెప్పి మిధునకు ఇంజెక్షన్ చేస్తుంది. ఏమవుతాడు  అతను మీకు అని మిధునను డాక్టర్ అడుగుతుంది.మీకు చిన్న జ్వరం వచ్చినా తట్టుకోలేకపోతున్నాడేంటని  ప్రశ్నిస్తుంది. మీమీద అంత కేరింగ్ చూపిస్తున్నాడు కదా...ఏమవుతాడు మీకు అని అనగా....కాబోయే భర్త అని చెబుతుంది. అంత జాగ్రత్తగా చూసుుకునే దొరికినందుకు మీరు చాలా లక్కీ అని అంటుంది.

Continues below advertisement

                 దేవా మిధుననే తలచుకుంటూ ఫుల్‌గా తాగి రోడ్డుపై నడుచుకుంటూ వస్తాడు. నిన్ను మర్చిపోవడానికి  చాలా ట్రై చేస్తూనే ఉన్నాను కానీ...నావల్ల కావడం లేదంటూ  తనలో తాను మాట్లాడుకుంటుంటాడు.నాలాంటివాడు నీకు కరెక్ట్‌ కాదని...నీ లైప్‌ మంచిగా ఉండాలని అంటాడు. ఇంజెక్షన్ చేయించుకుని ఆస్పత్రి నుంచి మిధునను తీసుకుని రిషి బయటకు వస్తాడు. ఇద్దరూ కలిసి కారులో వస్తుండగా... కారు సడెన్‌గా ఆగిపోతుంది. దీంతో రిషి కిందకు దిగి చూస్తానంటాడు. కారు చెడిపోవడంతో ఇద్దరూ అక్కడి నుంచి నడుచుకుంటూ చీకటిలోవస్తుంటారు.  అప్పుడు వారిని రౌడీ గ్యాంగ్ అడ్డగిస్తుంది. మిధునతో అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తారు. మిధునను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా...రిషి అడ్డుకుంటాడు. వారితో ఫైట్‌ చేస్తాడు. అప్పుడే  ఒక కత్తి తీసుకుని మిధునని పొడిచేందుకు మీదకు వస్తుండగా...రిషి చేతితో ఆ కత్తిని పట్టుకుంటాడు. రిషి చేయితెగి బ్లడ్ వస్తుంది. వారిని చితక్కొట్టడంతో రౌడీలందరూ అక్కడి నుంచి పరారవుతారు. మిధున వెంటనే  కర్చీప్‌ తీసుకుని ఆ గాయానికి కట్టుకడుతుంది. 

            తాగివచ్చి ఇంటి బయట పడుకున్న దేవా ముఖంపై నీళ్లుకొట్టి లేపుతుంది భాను. దీంతో దేవా ఆమెపై మండిపడతాడు. రాత్రి నువ్వుచేసిన పనికి నాకు ఇంతకన్నా ఎక్కువ కోపం వచ్చిందని అంటుంది. నీకు నన్నుచూసి కోపం రావడం ఏంటని నిలదీస్తాడు. రాత్రి తాగిన మత్తులో తాను ఏం చేసిన విషయం గుర్తులేని దేవాపై మధు మండిపడుతుంది. వర్షం పడుతుంటే తాగి రోడ్డుపై వచ్చావని గుర్తు చేస్తుంది. మిధునను మర్చిపోలేక తాగుతున్నావా...లేక నన్ను పెళ్లిచేసుకోవడం ఇష్టం లేక తాగుతున్నావా  అంటే ఏం చెప్పావురా అని నిలదీస్తుంది.నిన్ను నువ్వు మార్చిపోవడానికి తాగుతున్నావా అంటూ  చొక్కాపట్టుకుని నిలదీస్తుంది. అప్పుడు రాత్రి జరిగిన సంగతి మొత్తం దేవాకు గుర్తుకొస్తుంది. నువ్వు చెప్పిందంతా నమ్మడానికి నేనేమీ చిన్నపిల్లను కాదని...నువ్వు ఆ మిధునన మర్చిపోలేక తాగుతున్నావన్న సంగతి నాకు తెలుసులే అంటుంది. నీ గతం నాకు అనవసరమని...నీ భవిష్యత్‌ మాత్రమే నాకు కావాలి అంటుంది. నువ్వు ఆ మిధునను పూర్తిగా మర్చిపోవాలని....మనిద్దరికి ఎంగేజ్‌మెంట్ అయ్యిందన్న సంగతి మర్చిపోవద్దని హెచ్చరిస్తుంది. నువ్వే నా ప్రాణం, నువ్వే నా జీవతం అని బ్రతుకుతున్నానని...నువ్వు పిచ్చిపిచ్చివేషాలు వేసినా, పెళ్లి ఆపాలని చూసినా  నా శవాన్నే చూస్తావని హెచ్చరించింది. ఈ విషయం ఇంతకు ముందే చెప్పానని గుర్తుచేస్తుంది. విసిగించకుండా ఇక్కడ నుంచి వెళ్లిపో అని చెబుతాడు. గుడికిపోయి శుభలేఖలకు పూజ చేయించాలని....త్వరగా  వెళ్లి రెడీ అవ్వమని చెప్పి అక్కడి నుంచి భాను వెళ్లిపోతుంది.

Continues below advertisement

               మంచిరోజుకావడంతో తాంబూళాలు మార్చుకోవడానికి  రిషి,మిధునను తీసుకుని  కుటుంబ సభ్యులతో కలిసి మిధున తండ్రి గుడికి వస్తాడు. ఎంత త్వరగా  ముహూర్తం ఉంటే అంత త్వరగా  మీ పెళ్లి జరిపిస్తానని చెబుతాడు. దొంగ పెళ్లి జరిపిస్తున్నట్లుగా   ఇంత  హడావుడిగా తాంబూళాలు మార్చుకోవడం ఏంటని  త్రిపుర దెప్పిపొడుస్తుంది. నిన్న  అనుకుని ఇవాళ హడావుడి చేయడం ఏంటని...అందిరిని పిలిచి గ్రాండ్‌గా చేయోచ్చు కదా అని అంటుంది. దీనికి మిధున తల్లి బదులిస్తుంది. ఈ రోజు తప్పితే  దగ్గరలో మంచి ముహూర్తాలు లేవని పంతులుగారు చెప్పారని ...అందుకే గుడికి వచ్చామని చెబుతుంది. అయినా తాంబూలాలు మార్చుకోవడానికి రెండు కుటుంబాలు సరిపోతాయని  సర్దిచెబుతారు. ఇంకో రెండు గంటల్లో  మా అమ్మానాన్న కూడా వచ్చేస్తారని చెబుతాడు. ఇంతలో దేవాకి ఈ విషయం చెప్పడం మర్చిపోయాయని రిషి అనడంతో మిధున కంగారుపడుతుంది. పెళ్లికి వెళుతూ పిల్లిని చంకలో పెట్టుకుని పోయినట్లు అతను ఎందుకు అని త్రిపుర రిషితో అంటుంది. అతను వస్తే ఈ నిశ్చయ తాంబూళాలు జరిగినట్లేనని అనడంతో ఈ ఏపిసోడ్ ముగిసిపోతుంది.