సౌత్ సినిమా ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది నిత్యామీనన్. గ్లామర్ షోకి దూరంగా ఉంటూ.. కేవలం తన నటనతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది. ఈ మధ్యకాలంలో ఆమెకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. చివరిగా 'భీమ్లానాయక్' సినిమాలో కనిపించింది నిత్యా. అలానే 'ఇండియన్ ఐడల్ తెలుగు' షోకి జడ్జిగా వ్యవహరించింది. 


రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన 'మోడర్న్ లవ్ హైదరాబాద్' అనే వెబ్ సిరీస్ లో కనిపించింది. ఇదిలా ఉండగా.. రెండు రోజులుగా ఈ బ్యూటీ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి హీరోయిన్లపై రూమర్స్ రావడం కామన్. పలనా వ్యక్తితో డేటింగ్ లో ఉన్నారంటూ పలు గాసిప్స్ వినిపిస్తుంటాయి. కానీ నిత్యామీనన్ విషయంలో ఇలాంటి రూమర్స్ ఎప్పుడూ వినిపించింది లేదు. 


అంత క్లీన్ ఇమేజ్ తో ఇండస్ట్రీలో రాణిస్తుంది ఈ బ్యూటీ. అయితే ఇప్పుడు ఈమె పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. అది కూడా ఓ మలయాళ హీరోతో అంటూ కథనాలు ప్రసారం చేస్తున్నారు. కొంతకాలంగా మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోతో నిత్యా డేటింగ్ చేస్తుందని.. ఫైనల్ గా వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారని టాక్. ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మరి ఈ పెళ్లి వార్తలపై నిత్యామీనన్ స్పందిస్తుందేమో చూడాలి! 


Also Read: 'రెమ్యునరేషన్ కోసం నేనెందుకు ఇబ్బంది పెడతా?' రూమర్స్ పై రవితేజ రియాక్షన్!


Also Read: 'సలార్'లో మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ - ప్రశాంత్ నీల్ ప్లానింగ్ వేరే లెవెల్!