స్టార్ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ లు ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. హనీమూన్ తరువాత మళ్లీ వర్క్ లో బిజీ అయిపోయింది ఈ జంట. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ కపుల్ కి నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఊహించని షాకిచ్చింది. రూ.25 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అసలు విషయంలోకి వస్తే.. నయనతార, విఘ్నేష్ శివన్ ల పెళ్లి మహాబలిపురంలోని రిసార్ట్ లో జరిగింది.
ఈ పెళ్లికి సంబంధించిన డిజిటర్ల రైట్స్ మొత్తం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ.25 కోట్లకు తీసుకుందని అప్పట్లో వార్తలొచ్చాయి. పెళ్లికి సంబంధించిన పూర్తి ఖర్చులను నెట్‌ఫ్లిక్స్ చూసుకుందని టాక్. పెళ్లికి వచ్చిన గెస్ట్ ల కోసం మహాబలిపురంలో ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో రూమ్స్ బుక్ చేయడంతో పాటు.. భోజనం ఖర్చులు కూడా చూసుకున్నట్లు సమాచారం.
మేకప్ ఆర్టిస్ట్ ల నుంచి సెక్యూరిటీ గార్డుల వరకు.. భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇంత ఖర్చు పెట్టిన నెట్‌ఫ్లిక్స్ ఇప్పటివరకు నయన్ పెళ్లి వీడియాను ప్రసారం చేయలేదు. దానికి కారణం.. నయన్-విఘ్నేష్ లతో నెట్‌ఫ్లిక్స్ సంస్థ డీల్ క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వారి అగ్రిమెంట్ ప్రకారం.. నయన్, విఘ్నేష్ ల పెళ్లి ఫొటోలు, వీడియోలు నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ నుంచే బయటకు రావాలి.
కానీ విఘ్నేష్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో వీరి పెళ్లి ఫొటోలను షేర్ చేశారు. రూల్స్ కి విరుద్ధంగా ఫొటోలను పోస్ట్ చేయడంతో నెట్‌ఫ్లిక్స్ ఈ డీల్ ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. స్ట్రీమింగ్ రైట్స్ కోసం, పెళ్లి కోసం ఖర్చు చేసిన మొత్తం రూ.25 కోట్లను తిరిగిచ్చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ వ్యవహారంపై నయన్-విఘ్నేష్ ఎలా స్పందిస్తారో చూడాలి!
Also Read : 'ఆర్ఆర్ఆర్'లో పులితో ఎన్టీఆర్ ఫైట్ - వీఎఫ్ఎక్స్‌కు ముందు, తర్వాత
Also Read : అది పాస్తా వల్ల వచ్చిన కడుపు, ప్రెగ్నన్సీ కాదు - రూమర్లకు చెక్ పెట్టిన కరీనా కపూర్